కియ‌రాలో పెళ్లిపై ఎందుకింత క‌న్ఫ్యూజ‌న్?

Update: 2022-12-01 04:12 GMT
అందాల క‌థానాయిక‌ కియారా అద్వానీ బాలీవుడ్ యువ‌హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంట కాఫీ విత్ కరణ్ షోలో పెళ్లి వార్త‌ల‌పై హింట్ ఇచ్చింది. ఆ త‌ర్వాత గత కొద్ది రోజులుగా ఈ జంట‌ పెళ్లి జనవరి 2023లో జరుగుతుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే కియారా తన సినిమా షూటింగ్ లతో మరో రెండు నెలల పాటు పూర్తి బిజీగా ఉన్నందున జనవరిలో పెళ్లి వేడుక‌కు ఆస్కారం లేద‌ని తాజాగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే అభిమానుల ఊహాగానాల ప్ర‌కారం.. ఈ జంట వేసవిలో వివాహం చేసుకునేందుకు ఛాన్సుంది. అప్పటికి కియ‌రా మూవీ క‌మిట్ మెంట్లు అన్నీ పూర్త‌వుతాయి.

డేట్ చెప్పకుండా దాచేస్తే ఎలా?

సిద్ధార్థ్ -కియారా అద్వానీ జంట‌ పెళ్లి వార్తలు అభిమానుల్లో ట్రెండింగ్ టాపిక్.  గ‌త మూడు సంవత్సరాలుగా ఈ జంట‌ డేటింగ్ గురించి పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవ‌ల‌ ఈ జోడీ పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారంటూ ఒక సెక్ష‌న్ ఫ్యాన్స్ లో ప్ర‌చారం సాగుతోంది.

కొంద‌రు సన్నిహితులు  కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుందని లీకులందాయి. పెళ్లి ఢిల్లీలో కుటుంబసభ్యులు బంధువుల సమక్షంలో జరగనుందని క‌థ‌నాలొచ్చాయి.  ఏప్రిల్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారని ఒక సెక్ష‌న్ లో పుకార్లు కూడా ఉన్నాయి.

వివాహం తర్వాత దిల్లీ- ముంబైలో విడివిడిగా గ్రాండ్ రిసెప్షన్ జరగనుందిట‌. ఆ ఇద్దరూ రిసెప్షన్ తర్వాత కాక్టెయిల్ పార్టీలో స‌న్నిహితులంద‌రితో సంద‌డి చేస్తారని దీనికి ప్లానింగ్ ఇప్ప‌టికే సిద్ధ‌మైంద‌ని కూడా టాక్ ఉంది.  ఇటీవ‌ల‌ పెళ్లికి ముందు కియ‌రా అద్వాణీ హాటెస్ట్ ఫోటోషూట్స్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తున్నాయి. అభిమానుల‌లో ఇవి వైర‌ల్ గా మారుతున్నాయి.

కియారా అద్వానీ తదుపరి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ స‌ర‌స‌న ఆర్.సి15 చిత్రంలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలే ఒక చిన్న షెడ్యూల్ పూర్తయింది. త‌దుప‌రి భారీ షెడ్యూల్ కోసం శంక‌ర్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News