పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఆరంభంలో వకీల్ సాబ్ ను ఆ వెంటనే క్రిష్ దర్శకత్వంలో సినిమాను ఈ ఏడాది చివర్లో హరీష్ శంకర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని పవన్ భావించాడు. అందుకోసం వరుసగా అయిదు సినిమాలకు ఇప్పటికే ఓకే చెప్పాడు. పవన్ సినిమాల విషయంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో కరోనా మొత్తం ప్లానింగ్ ను తారు మారు చేసింది. మూడు సినిమాలు ఈ ఏడాది వస్తాయి అనుకుంటే కనీసం ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయాడు.
వకీల్ సాబ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా సంక్రాంతికి కూడా వకీల్ సాబ్ రావడం లేదు. సమ్మర్ లో కాని వకీల్ సాబ్ వచ్చే పరిస్థితి లేదు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ మూవీ మొదలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రిలీజ్ లేదు కదా అనో లేదంటే మరేదైనా కారణమో కాని వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను సాగతీస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి వరకు షూటింగ్ ను నిర్వహించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పవన్ తదుపరి సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. వకీల్ సాబ్ ఆలస్యం వల్ల ఇతర సినిమాల పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ లేకుండా ఉంది.