ఈరోజుల్లో స్టార్ హీరో నటించిన సినిమా అయినా.. కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన భారీ చిత్రమైనా లేదా చిన్న మీడియం రేంజ్ సినిమా ఐనా.. సరైన రీతిలో పబ్లిసిటీ చేయకపోతే ఆశించిన ఫలితం దక్కడం కష్టమవుతోంది. అలా అని కేవలం ప్రమోషన్స్ మాత్రమే సినిమాలను హిట్ చేస్తాయని చెప్పలేం. అందులో ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసే కంటెంట్ కూడా ఉండాలి.
అయితే ఒక్కోసారి మంచి కంటెంట్ ఉన్న మూవీ అయినా సరే.. పబ్లిసిటీ చేయకపోతే థియేటర్లలో ఆడని పరిస్థితి ఉంటుంది. ఏ సినిమాకైనా ప్రమోషన్స్ అనేవి జనాల దృష్టిని ఆకర్షించి, ఫస్ట్ వీకెండ్ లో మంచి ఓపెనింగ్స్ రావడానికి హెల్ప్ అవుతాయి. కానీ మూవీ సక్సెస్ అవ్వాలంటే ఇవి మాత్రమే సరిపోవు. వీక్ డేస్ లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించాల్సి ఉంటుంది. అందుకు మంచి కంటెంట్ కావాలి. అలాంటి సినిమాలైతే మిగతా రోజుల్లోనూ ప్రేక్షకాదరణ పొందగలుగుతాయి.
అదే సమయంలో కంటెంట్ ఉన్న చిత్రాలకు కూడా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యమని చెప్పాలి. ఎంత మంచి సినిమా ఐనా కూడా.. దానికి తగ్గట్టుగా గట్టిగా ప్రచార కార్యక్రమాలు చేస్తేనే జనాలను థియేటర్ల వరకూ రప్పించగలుగుతారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా మంచి రన్ రావాలంటే దూకుడుగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.
గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ది వారియర్' సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ రాజీ లేకుండా కష్టపడ్డారు. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మూవీ ఇది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. అగ్రిసివ్ గా పబ్లిసిటీ చేయడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
కానీ మొదటి మూడు రోజుల తర్వాత 'ది వారియర్' సినిమా వసూళ్ళు డ్రాప్ అయ్యాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే చాలా దూరంలో ఉంది. బాగా ప్రమోషన్స్ చేసి ఓపెనింగ్స్ రాబట్టారు కానీ.. ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయారనే అనుకోవాలి. తెలుగుతో పాటుగా తమిళంలోనూ ఈ మూవీ ఫలితం అలానే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే అదే రోజు విడుదలైన 'గార్గి' సినిమా పరిస్థితి మరోలా ఉంది. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. రానా దగ్గుబాటి సమర్పించారు. సినిమా చూసిన వాళ్ళు మంచి కంటెంట్ తో వచ్చారని అన్నారు. కానీ ఇలాంటి సినిమా ఒకటి ఉందనే సంగతి కూడా చాలామందికి తెలియలేదు. దీనికి కారణం మేకర్స్ ప్రమోషన్స్ చేయకపోవడమే అని తెలుస్తోంది.
ఓటీటీలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు థియేటర్లకు రావడం తగ్గించేసారనేది వాస్తవం. గట్టిగా ప్రమోషన్స్ చేస్తేనే వారిని సినిమా హాళ్ల వరకూ రప్పించగలుగుతున్నారు. ఇప్పుడు 'గార్గి' చిత్రానికి టాక్ బాగున్నా.. దీన్ని ఓటీటీ సినిమాగా భావిస్తున్నారు.
సాధారణ ప్రేక్షకులు ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నారు. జీరో పబ్లిసిటీయే దీనికి కారణమని అర్థం అవుతోంది. కనీస ప్రమోషన్స్ చేసినా 'గార్గి' సినిమాకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా లాభదాయకమైన ప్రాజెక్ట్ గా నిలిచేది.
కంటెంట్ మరియు సరైన ప్రమోషన్స్ కూడా ఉంటేనే సక్సెస్ వస్తుందని గత వారం రిలీజైన రెండు సినిమాల రిజల్ట్ ని ఉదాహరణలుగా చెప్పొచ్చు. కేవలం కంటెంట్ ని నమ్ముకుని ముందుకు వెళ్లినా లేదా ప్రమోషన్స్ మీద ఆధారపడినా వర్కవుట్ అవదని స్పష్టంగా తెలుస్తుంది. మరి మేకర్స్ ఈ విషయాన్ని గమనిస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను అందుకోవచ్చు.