సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ జంటపై పుకార్ల గురించి తెలిసిందే. ఈ వెండితెర జోడీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇప్పటికే సహజీవనం చేస్తున్నారని ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపించాయి. అయితే వాటిని ఆ ఇద్దరూ ఖండించారు. నరేష్ ఇంకా విడాకులు తీసుకోకుండా సహనటితో ఎఫైర్ సాగిస్తున్నారన్న ఆరోపణల ఫర్వం గురించి తెలిసిందే.
అయితే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న క్రమంలో నరేష్- పవిత్ర లిప్ లాక్ ఫోటో అంతర్జాలంలో దుమారం రేపింది. ''మళ్లీ పెళ్లి'' అనే ప్రకటన #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియో వైరల్ కావడంతో అంతా ఖంగు తిన్నారు. ఇది నిజమా? ఇన్నిరోజులుగా మీడియాలో వెలువడుతున్న కథనాలన్నీ వాస్తవాలేనా? అంటూ తిరిగి అంతర్జాలంలో డిబేట్ మొదలైంది.
అయితే ఇది పక్కాగా నిజమేనా? అన్నది ఆరా తీస్తే షాకిచ్చే విషయాలే తెలిసాయి. ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కు. ఈ జంట కలిసి నటిస్తున్న 'మళ్లీ పెళ్లి' అనే సినిమా ప్రమోషన్ కోసం తాజా ఉదంతాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటూ సాగిస్తున్న పబ్లిసిటీ గిమ్మిక్కు అని తెలిసింది.
ఈరోజుల్లో పుకార్లతో బోలెడంత ఉచిత పబ్లిసిటీ కొట్టేయొచ్చు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. ఏదైనా అనవసర వివాదాన్ని కెలకడం తమ సినిమాకి ప్రచారం చేసుకోవడం నేటి ట్రెండ్. ఇప్పుడు నరేష్- పవిత్ర జోడీ కూడీ అదే ట్రిక్కును ప్లే చేశారు. మళ్లీ పెళ్లి సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ దక్కింది.
నిజానికి ఇది 'నరేష్ -పవిత్ర' జంట బయోపిక్కు అని కూడా ఫిలింనగర్ లో సెటైర్లు వేస్తున్నారు. ఈ జంటపై ఇటీవలి వచ్చిన పుకార్ల నేపథ్యంలో ఒక రియల్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించారని.. తమ గత సంబంధాలు ఒకరితో ఒకరు ఉన్న ప్రస్తుత బంధాన్ని ఎలివేట్ చేసే కథలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారని ఇప్పటికే స్క్రిప్టు కూడా రెడీ చేవారని తెలుస్తోంది.
అసలు ఈ జంట సంబంధంలో ఉన్నారో లేదో త్వరలో పెళ్లాడుతారో లేదో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం కలిసి వెండి తెర కోసం జంటగా నటిస్తున్నారు. తాజా ఎపిసోడ్స్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకునే ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. మొత్తానికి నెటిజనులను ఇలా కూడా మోసం చేస్తున్నారు. ఒకే ఒక్క లిప్ లాక్ తో ఏడాదంతా ప్రజలకు కావాల్సినంత చికెన్ మసాలా పకోడీ ఎర వేసారు. మొత్తానికి ఎత్తుగడ ఫలించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.