సినీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ విషయంలో దర్శకనిర్మాతల మధ్య, హీరోహీరోయిన్లు - నిర్మాతలకు మధ్య అప్పుడప్పుడు విభేదాలు తలెత్తుతుంటాయి. టాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. గతంలో పారితోషికం ఇష్యూ వల్ల ప్రాజెక్ట్స్ నుంచి బయటకు వెళ్లిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ - ఓ లేడీ ప్రొడ్యూసర్ మధ్య రెమ్యూనరేషన్ విషయంలో అభిప్రాయ భేదాలు రావడంపై సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
ఇప్పుడిప్పుడే నిర్మాతగా నిలదొక్కుకొంటున్న ఓ స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తె, ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం ఒక స్టార్ హీరోయిన్ ను సంప్రదించారు. స్టోరీ విన్న సదరు హీరోయిన్ సూచనప్రాయంగా సినిమాకి అంగీకరించిందట. అయితే పారితోషికం విషయంలో ఇద్దరికీ బెడిసికొట్టింది. ముందుగా అనుకున్న రెమ్యూనరేషన్ కాకుండా.. దాని కంటే తక్కువ మొత్తం ఇవ్వగలమని అమ్మడితో బేరసారాలు సాగించారట. దీంతో ఇద్దరి మధ్య బాగా గ్యాప్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో లేడీ ప్రొడ్యూసర్ పై అసంతృప్తితో ఉన్న ఆ స్టార్ హీరోయిన్.. తక్కువ రెమ్యూనరేషన్ కి ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పేసి వైదొలగిందట. ఈ విషయాన్ని సదరు హీరోయిన్ ఒక సస్టార్ హీరో దగ్గర చెప్పుకొని బాధపడిందట. అలానే నిర్మాత కూడా ప్రస్తుతం చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేని ఆ హీరోయిన్ డిమాండ్ చేసినంత ఇవ్వాలని అనడం కరెక్ట్ కాదని సన్నిహితుల దగ్గర చెబుతోందట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రెమ్యూనరేషన్ వివాదమే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.