మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ దాదాపుగా ముగిసింది. ప్రస్తుతం మలయాళం హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. రెండు మూడు నెలల్లోనే లూసీఫర్ రీమేక్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారట. లూసీఫర్ రీమేక్ తర్వాత తమిళ హిట్ మూవీ వేదాళం ను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా దర్శకుడు మెహర్ రమేష్ ఫినీష్ చేయడం జరిగిందట. అన్నా చెల్లిల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
ఒరిజినల్ వేదాళంలో అజిత్ కు చెల్లి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో స్టార్ హీరోయిన్స్ కూడా తెలుగు లో ఆ పాత్రను చేయాలనే ఆసక్తితో ఉన్నారట. తెలుగు లో చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ ను నటింపజేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న కీర్తి సురేష్ చెల్లి పాత్రను చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా సూపర్ స్టార్స్ తో నటిస్తోంది. సాదారణంగా కమర్షియల్ హీరోయిన్స్ అలాంటి పాత్రలు చేసేందుకు అస్సలు ఆసక్తి చూపించరు. కీర్తి సురేష్ మాత్రం ఇంట్రెస్ట్ గా ఉంది.
ఇంకా కన్ఫర్మ్ అయినట్లుగా అధికారికంగా ఎలాంటి వార్త అయితే రాలేదు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు మెహర్ రమేష్ ఆమెను కలిసి కథను చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒరిజినల్ వర్షన్ లో కంటే తెలుగు వర్షన్ లో చెల్లి పాత్రకు ఇంకాస్త ఎక్కువ వెయిట్ ఇవ్వబోతున్నట్లుగా చెప్పడంతో పాటు.. కథను కూడా మార్చి చెప్పాడట. కీర్తి సురేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి కనుక డేట్ల విషయంలో కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తుందట. అందుకే కమిట్ అవ్వాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హీరోయిన్ గా చేస్తున్నా కూడా కీర్తి సురేష్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. కనుక కీర్తి సురేష్ వేదాళం తెలుగు రీమేక్ లో నటించేందుకు దాదాపుగా ఓకే చెప్పే అవకాశం ఉంది. దర్శకుడు మెహర్ రమేష్ కాస్త ఎక్కువగా ట్రై చేస్తే ఆమె త్వరలోనే ఒప్పుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కీర్తి సురేష్ ను ఒప్పించేందుకు స్క్రిప్ట్ లో మార్పుల నుండి మొదలుకుని ఆమె పాత్రకు సంబంధించిన విషయాల వరకు ఒరిజినల్ నుండి ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మార్చి రాయడం జరిగిందట. ఇంత కష్టపడుతున్న మెహర్ రమేష్ కోసం అయినా కీర్తి సురేష్ ఓకే చెప్తుండా అనేది చూడాలి.
కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాటలో నటిస్తోంది. తమిళంలో రజినీకాంత్ తో అన్నాత్తే సినిమాలో నటించింది. పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ అస్సలు తీరిక లేకుండా నటిస్తూనే ఉన్న కీర్తి సురేష్ వచ్చే ఏడాది కనీసం నాలుగు అయిదు సినిమాలతో అయినా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో ఈ వేదాళం కూడా ఉంటుందా అనేది చూడాలి.