రంగ‌మ్మ‌త్త కోసం ప‌ర్స‌న‌ల్ చెఫ్ తో వండించాడ‌ట‌

Update: 2021-05-01 00:30 GMT
రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించిన అన‌సూయ‌కు ఎంత మంచి పేరొచ్చిందో తెలిసిందే. యువ‌త‌రం గుండెల్ని కొల్ల‌గొట్టే న‌ట‌నతో క‌ట్టి ప‌డేసారు. అయితే ఆ సినిమా షూటింగ్ లో జ‌రిగిన ఓ త‌మాషా సంఘ‌ట‌న‌ను ఇప్పుడు నెమ‌రు వేసుకున్నారు అన‌సూయ‌.

సెట్లో త‌న‌కు భోజ‌నం స‌మ‌యం .. చేప‌లు వంట‌కం రెడీ. కానీ త‌న‌కు చేప‌లు తినే అల‌వాటు లేదు. దాంతో చిత్ర క‌థానాయ‌కుడు రామ్ చ‌ర‌ణ్ త‌న చెఫ్ ని పిలిచి పెద్ద పన్నీర్ ముక్కలను తయారు చేయించార‌ట‌. అది నాకు చేపలాగా రుచిగా ఉంటుంది. కానీ ఆ టైమ్ లో అలా చేయవలసిన అవసరం లేదు. అతను మెగా పవర్ స్టార్ అయినా నా కోసం అలా చేశారు`` అని తెలిపారు. ఆ స‌మ‌యంలో న‌న్ను పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేనే లేదు. కానీ అతను పట్టించుకున్నాడు. రామ్ చరణ్ నా అభిమాన స్టార్.. ఒక మంచి డార్లింగ్ అని అన్నారు.

అన‌సూయ న‌టించిన `థాంక్యూ బ్రదర్` చిత్రం మే 7న ఆహాలో విడుద‌ల‌వుతోంది. బ‌న్ని-సుకుమార్  పాన్-ఇండియన్ చిత్రం పుష్ప‌లోనూ అన‌సూయ‌కు అవ‌కాశం ద‌క్కింది. తెలుగులో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూనే.. తమిళం మలయాళంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది.
Tags:    

Similar News