సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు క్రేజ్ ఉన్న సినిమాలపై ఏదో ఒక ఆరోపణలు రావడం.. ఈ మధ్య ఎక్కువైపోయింది. ప్రస్తుతం నయనతార సినిమాలకు కోలీవుడ్ లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉంటుందో చూస్తూనే ఉన్నాం. నయన్ నటిస్తున్న ఫిమేల్ ఓరియెటండ్ హారర్ మూవీ డోరా చిత్రం ఈ నెల 31న విడుదల కానుండగా.. సరిగ్గా రెండు వారాల ముందు ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి.
చెన్నైకు చెందిన రైటర్ శ్రీధర్.. డోరా కథ తన స్క్రిప్ట్ లోని కొంత భాగమేనంటూ ఆరోపణలు చేశాడు. ఆలీబాబవుమ్ అర్వుత కారం ఆధారంగా డోరా మూవీ చేస్తున్నారని అనడంతో.. సినిమా రిలీజ్ పై కూడా టెన్షన్ పెరిగింది. మొదట వీటిపై సైలెంట్ గా ఉన్న రైటర్ కం డైరెక్టర్ దాస్ రామస్వామి.. ఇప్పుడు స్పందించాడు. సౌత్ ఇండియా రైటర్స్ అసోసియేషన్ దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లిన డోరా డైరెక్టర్.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
రైటర్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడీ డోరా స్టోరీకి క్లీన్ చిట్ వచ్చేసింది. ఇది పూర్తిగా దర్శకుడు దాస్ రామస్వామి రాసుకున్న సబ్జెక్ట్ మాత్రమేనని.. రైటర్ శ్రీధర్ ఆరోపణలు నిజం కాదని తేల్చేశారు. తన స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతోనే దాస్ రామస్వామి మొదట స్పందించలేదని.. కానీ మూవీ రిలీజ్ కి అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉండడంతోనే.. తక్షణ పరిష్కారాన్ని కోరుకున్నాడని కోలీవుడ్ జనాలు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/