కమర్షియల్ సినిమాల్లో సైతం తన మాటలతో జీవితానికి అవసరమైన పాఠాలతో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తాడని పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ముందు నుంచి వేరే సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకుంటారనే కామెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి కొత్త సినిమా అది ప్రూవ్ చేస్తూనే ఉంది. ఇంతకు ముంచు అఆ రిలీజైనప్పుడు అది యద్దనపూడి సులోచనారాణి గారి మీనా నవల ప్లస్ అదే పేరుతో వచ్చిన విజయనిర్మల గారి సినిమా నుంచి తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు సాంకేతిక కారణం వల్ల కార్డు మిస్ అయ్యిందని త్రివిక్రమ్ చెప్పిన సంగతి గుర్తే. ఇప్పుడు కూడా అలాంటివి వివాదమే మరొకటి వచ్చింది.
అతని పేరు వేంపల్లి గంగాధర్. రాయలసీమ యాసలో రచనలు చేసి పేరు మాత్రమే కాదు కేంద్రీయ సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ప్రణబ్ చేతుల మీదుగా అందుకున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవ్వుతున్న ఒక పేస్ బుక్ పోస్ట్ గత ఇరవై నాలుగు గంటలుగా ప్రకంపనలు రేపుతోంది. అందులో చెప్పిన ప్రకారం త్రివిక్రమ్ ప్రత్యేకంగా వేంపల్లి గంగాధర్ తో మూడు నాలుగు రోజులు భేటీ చేసి సీమ యాసకు సంబందించిన చర్చలతో పాటుగా ఈయన రాసిన కథల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అరవింద సమేత వీర రాఘవలో కీలకంగా నిలిచిన మొండికత్తి పేరుతో ఓ కథ వేంపల్లి గంగాధర్ రాసారు. పాపాఘ్ని పేరుతో రాసిన పుస్తకంలో ఇదే పేరుతో ఆ కథ ఉంది.
పేస్ బుక్ లో వైరల్ అవ్వుతున్న పోస్ట్ ప్రకారం .....సినిమా చూసాక తాను షాక్ తిన్నానని తానేమి డబ్బు ఆశించలేదని కనీసం థాంక్స్ కార్డు కూడా వేయకుండా పోనీ సమాచారం అయినా ఇవ్వకుండా ఇలా తన మొండికత్తి కథ పేరుని వాడేసుకోవడం ఎంత వరకు సబబు అని ఫోటో సాక్ష్యాలతో సహా వివరంగా పెట్టేసరికి గురూజీ అని ప్రేమగా పిలుచుకునే అభిమానులకు సైతం ఇది మింగుడు పడటం లేదు. కానీ విచిత్రంగా దీని మీద చాలా చర్చ జరిగిన హఠాత్తుగా సదరు రచయిత పోస్ట్ ని డిలీట్ చేయడం అసలు ట్విస్ట్. అప్పటికే అతను పెట్టిన ఫోటోలు మ్యాటర్ విపరీతంగా వైరల్ అయిపోయింది. నైతిక బాధ్యతగా అయినా దీని గురించి త్రివిక్రమ్ స్పందిస్తే బెటర్ అని కోరుతున్నారు సినిమా ప్రేమికులు.