ఈసారైనా కొనేసి పేరిచ్చేయ్ త్రివిక్రమ్

Update: 2018-01-22 18:30 GMT
కొనాలంటే కష్టం కాని.. కొట్టేయాలంటే ఈజీనే.. అంటూ మన త్రివిక్రమ్ 'మన్మథుడు' సినిమాలో ఒక డైలాగ్ రాశాడు. ఆ తరువాత మాటల మాంత్రికుడిగా ఎదిగి.. తనే ఒక డైరక్టర్ అయ్యాక.. చాలా ఒరిజినల్ సినిమాలే తీస్తున్నాడు అనుకుంటే.. చాలా సినిమాల్లో హాలీవుడ్ షేడ్స్ సీన్స్ కనిపించాయి. కట్ చేస్తే మొన్న వచ్చిన అజ్ఞాతవాసి అయితే ఏకంగా లార్గో వించ్ అనే సినిమాకు మక్కికి మక్కీ కాపీ కొట్టేశాడు. తద్వారా వచ్చే లీగల్ చిక్కులను పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఫ్యాన్స్ ఈ పరిణామాలతో బాగా ఫీలవుతున్నారు.

అ..ఆ సినిమా రిలీజవ్వగానే.. ఆ సినిమాను తన కథ ఆధారంగా తీసినా కూడా తనకు క్రెడిట్ ఇవ్వకపోవడం బాధించింది అని సీనియర్ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఆరోపణలు చేశారు. ఆ తరువాత త్రివిక్రమ్ ఆమె పేరు సినిమా క్రెడిట్స్ లో యాడ్ చేశాడు. ఆల్రెడీ నవల్ తాలూకు రైట్స్ కొనుక్కున్నా కూడా.. కథ రాసిందే వేరే రైటర్ అంటే తన పేరు పోతుందని నామోషి పడ్డాడేమో అనుకున్నారు అభిమానులు. ఇప్పుడు లార్గో వించ్ అయితే ఏకంగా కథ మరియు సీన్లను మొత్తంగా లేపేశాడు. ఇప్పుడు కూడా రైట్స్ గట్రా కొనలేదు. ఒకవేళ కొనుంటే బేస్డ్ ఆన్ పలానా మూవీ అని చెప్పేసి ఉండొచ్చు. తమకు ఎంతో ఇష్టమైన దర్శకుడు అలా చేస్తున్నాడంటే అభిమానులను ఖచ్చితంగా అది బాధిస్తోంది.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కథ కూడా ఒక నవల నుండి తీసుకున్నదే అంటున్నారు సన్నిహితులు. అది యద్దనపూడి నవలా లేక మరెవరైనా రచయితదా తెలియదు కాని.. ఒకవేళ నిజంగానే నవల తీసుకుంటే మాత్రం.. మూల కథ పలానా నవల్ నుండి తీసుకున్నాం అంటూ పేరేసి తీస్తే బెటర్ అని సూచిస్తున్నారు అభిమానులు. ఇప్పుడు రాఘవేంద్రరావు నుండి రాజమౌళి వరకు.. తమ సినిమా కథలను వారు రాసుకోరు. పూరి జగన్ అన్నీ ఆయనే రాసుకుంటాడు. అందు కారణంగా ఎవరికి హిట్లు లేకుండాపోయాయ్.. ఎవరికి పేరు లేకుండా పోయింది?
Tags:    

Similar News