పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకేసారి రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. # PSPK26 ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వకీల్ సాబ్ అనేది టైటిల్. దిల్ రాజు నిర్మిస్తున్నారు. # PSPK27 క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. షూటింగుల బంద్ వల్ల ఇక ఈ రెండు సినిమాల కాల్షీట్ల పరంగా చిక్కులు ఏవైనా ఉన్నాయా? అంటే.. తాజా సన్నివేశం చూస్తుంటే .. పీకే నటిస్తున్న వకీల్ సాబ్ కి ఇబ్బందికర పరిస్థితి ఉందని తెలుస్తోంది.
నిజానికి ఈ సినిమాని కేవలం 90 రోజుల్లో పూర్తి చేసి మే 15న రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ అనూహ్యంగా సీన్ మారింది. మొన్న ఛాంబర్ డెసిషన్ తో 15 రోజుల పాటు షూటింగులు చేయలేని పరిస్థితిలో మొత్తం షడ్యూల్ అంతా డిస్ట్రబ్ అయ్యింది. చెప్పిన ప్రకారం పూర్తి చేసి రిలీజ్ చేయలేని పరిస్థితి. ఇక కరోనా ముప్పు అటు ఆర్.ఆర్.ఆర్- జాన్- చిరు 152 (ఆచార్య) చిత్రాలపై ఏ విధంగా ప్రభావం చూపిందో అదే తీరుగా వకీల్ సాబ్ పైనా ప్రభావం చూపిస్తోంది.
షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయడం వల్ల ఇప్పుటు పవన్ అటు క్రిష్ దర్శకత్వంలోని # PSPK27 కి షిఫ్టవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే వకీల్ సాబ్ చిత్రీకరణకు తిరిగి అటెండవ్వాలంటే అక్కడ షెడ్యూల్ అవ్వాల్సి ఉంటుంది. ఇక పవన్ లాంటి సీనియర్ ని నిర్మాత దిల్ రాజు డిమాండ్ చేసేంత సీన్ ఉండదు. పవన్ చెప్పినట్టే షెడ్యూల్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందే అనుకున్న మే 15 రిలీజ్ సాధ్యమేనా కాదా? అన్న డైలమా దిల్ రాజు లో నెలకొందట. ఏప్రిల్ ఒకటి నుంచి తిరిగి షూటింగులు ప్రారంభించేసినా అనుకున్న సమయానికి పూర్తి చేసి .. పోస్ట్ ప్రొడక్షన్ సజావుగా ముగించి రిలీజ్ చేయగలమా? లేదా? అన్న డైలమా నెలకొందట. పవన్ అసలే పర్ఫక్షనిస్ట్. ఒకేసారి రెండు సినిమాలు అంగీకరించినా .. ప్రతిదీ పక్కాగా వచ్చే వరకూ వెయిట్ చేస్తాడు. నెమ్మదిగా అయినా పక్కగా ఉండాలంటాడు. అటు ఏ.ఎం.రత్నం లాంటి వాళ్లను కన్విన్స్ చేయగలిగినా పవన్ ని తిరిగి ఇటు వకీల్ సాబ్ షూట్ కి తీసుకురావడం అంత ఈజీ కాదు. మొత్తానికి పీకే తో పెట్టుకున్నందుకు ఆయనకు బొప్పి కట్టడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది మరి.