సూపర్ స్టార్ మహేష్ బాబు గత మూడు రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'సర్కారు వారి పాట' షూటింగ్ సమయంలో తన పర్సనల్ స్టైలిస్ట్ కరోనా బారిన పడటంతో, ముందు జాగ్రత్తగా మహేష్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ విషయం తెలియడంతో మహేష్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ కరోనా నిర్ధారణ టెస్టు చేయగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మహేష్.. రేపు సెకండ్ డోస్ వాక్సినేషన్ కూడా తీసుకోనున్నారని సమాచారం. తమ అభిమాన హీరోకి కోవిడ్ నెగిటివ్ గా వచ్చిందని తెలియడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, కరోనా సెకండ్ మహమ్మారి విజృంభన కారణంగా సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. సినీ ఇండస్ట్రీ గతేడాది ఎదుర్కొన్న పరిస్థితులనే మళ్ళీ చూడాల్సి వస్తోంది. ఇప్పటికే థియేటర్లు క్లోజ్ అయ్యాయి. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక సినీ ప్రముఖులు కరోనా బారిన పడటంతో వారితో సన్నిహితంగా ఉండేవారు ఎవరికి వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు కరోనా సోకడంతో చికిత్స తీసుకుని బయటపడ్డారు. అలానే ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా పలువురు సెలబ్రిటీలు కోవిడ్ కారణంగా హోమ్ క్యారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.