తనదైన విలక్షణ నటనతో దశాబ్ధాల పాటు హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పాయ్ సౌత్ లోనూ తనదైన ముద్ర వేశారు. సత్య- హ్యాపీ లాంటి చిత్రాలతో తెలుగు నాటా భారీగా ఫాలోయింగ్ తెచ్చుకున్నారాయన. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ లోనూ ఆయన కథానాయకుడిగా నటించి మెప్పించారు. త్వరలో సీజన్ 2 స్ట్రీమింగ్ కి రానుంది.
మనోజ్ తదుపరి వేరొక భారీ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. కానీ ఈలోగానే అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజా ప్రాజెక్ట్ `డిస్పాచ్` షూటింగ్ లో పాల్గొంటున్న అతడికి వైరస్ సోకిందని కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి అతడు ఇంట్లోనే స్వీయనిర్భంధంలో ఉన్నారు. తన దర్శకుడు కను బెహ్ల్ కి వైరస్ పాజిటివ్ అని తేలాక అతడికి పాజిటివ్ అని తేలింది.మనోజ్ బాజ్‌పేయి బృందం దీనిని అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతానికి షూటింగ్ ఆపేశారు. కొన్ని నెలల్లో తిరిగి ప్రారంభమవుతుంది. మనోజ్ బాజ్ వైద్యంతో వేగంగా కోలుకుంటున్నారు`` అని వెల్లడించారు.
మనోజ్ భాజ్ పాయ్- సమంత - ప్రియమణి తదితరులు నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. అయితే రకరకాల కారణాలతో ఫిబ్రవరి 19న స్ట్రీమింగుకి రావాల్సిన సీజన్ 2 ఆగిపోయిందని ప్రచారమైంది. దీనిని మనోజ్ ఖండించారు. ఇవన్నీ అర్థం లేని పుకార్లు అంటూ కొట్టి పారేసారు. కొత్త తేదీని వెల్లడిస్తామని అన్నారు.