టెంపర్‌ బ్యూటీకి కరోనా పాజిటివ్‌

Update: 2021-12-30 12:43 GMT
కరోనా సెకండ్‌ వేవ్ సమయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు చాలా మంది కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. అందులో కొందరు కరోనా నుండి తేరుకోలేక తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఈమద్య కాస్త కరోనా కేసులు లేవు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ థర్డ్‌ వేవ్‌.. ఒమిక్రాన్‌ తో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. బాలీవుడ్‌ కు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడ్డట్లుగా అధికారికంగా ప్రకటించారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నోరా ఫతేహీ కూడా కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించింది. తాను దురదృష్టవశాత్తు కరోనా బారిన పడ్డట్లుగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది.

తాను రెండు రోజుల క్రితం కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. నాకు కోవిడ్‌ అని తేలగానే వెంటనే ముంబయి మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చాను. వారి సలహా మేరకు ఇంట్లోనే ఉన్నాను. వారికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. గత వారం రోజులుగా నాతో కలిసి వారు  తప్పకుండా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేసింది. నోరా ఫతేహి ప్రస్తుతం ముంబయిలోని తన నివాసానికి పరిమితం అయ్యింది. ఎక్కువ లక్షణాలు ఏమీ లేవు కనుక ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లుగా కూడా ఆమె చెప్పింది.

తెలుగు లో టెంపర్‌ సినిమా లో ప్రత్యేక పాట చేసి అలరించిన ఈ అమ్మడు బాహుబలి తో తెలుగు వారికి మరింత చేరువ అయ్యింది. ఐటెం సాంగ్స్ తో పాటు హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఈ అమ్మడు మరిన్ని సినిమాలను ప్రస్తుతం చేస్తుంది. ఈమె బిగ్‌ బాస్ ద్వారా ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఓటీటీ మరియు టీవీల ద్వారా నోరా ఫతేహి ఎంతో మందిని ఎంటర్‌ టైన్ చేసింది.. చేస్తూనే ఉంది. ఈ హాట్‌ బ్యూటీ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
Tags:    

Similar News