మెగాహీరోల్లో చిరంజీవి- రామ్ చరణ్- పవన్ కల్యాణ్ వంటి స్టార్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స అనంతరం వీరంతా కోలుకున్నారు. చరణ్ ఇటీవల మరోసారి క్వారంటైన్ కి వెళ్లారు. తాజాగా మెగా కాంపౌండ్ లోనే మరో అగ్ర హీరో అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇటీవల ల్యాబ్ టెస్ట్ చేయించగా ఫలితం పాజిటివ్ అని వచ్చింది. అల్లు అర్జున్ ఇంట్లో తనను తాను వేరు చేయాలని నిర్ణయించుకున్నారు. స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ట్విట్టర్లో ఇదే విషయాన్ని తెలియజేశాడు. చాలా మంది అభిమానులు అతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయితే అల వైకుంఠపురములో కోస్టార్ పూజా హెగ్డే బన్నీ ట్వీట్ కు కొంత ఫన్నీగా స్పందించారు.
బన్ని కోలుకోవాలని కోరుకుంటూనే పూజా హెగ్డే ఇలా రాసారు ``బంటు అమూల్య కంపెనీకి ఇస్తున్నట్లుంది! జాగ్రత్త వహించండి .. అల్లు అర్జున్ .. మీకు కొంత వైద్యం.. కాంతి .. శక్తి అవసరం. మీరు ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంటారు!`` అని పూజా ట్వీట్ చేశారు.
కొన్ని రోజుల క్రితం పూజా హెగ్డే కొరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. పూజా ఒంటరిగా ఉంది కానీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంది. అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి పూజా ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ సెషన్ నిర్వహించాలని భావిస్తోంది. నిన్న పూజా కూడా ఆన్ లైన్ లో యోగా సెషన్ లో పాల్గొని తన అభిమానులతో పంచుకున్నారు.
పూజా స్పందన ఇతరులతో పోలిస్తే భిన్నమైనది. బన్ని తమ సంస్థకే ఇస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించినా అతడు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ - పూజా హెగ్డే పాత్రల పేర్లు బంటి -అముల్య అన్న సంగతి తెలిసినదే.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తుండగా పూజా హెగ్డే వరుసగా నాలుగు చిత్రాలతో బిజీ. రాధేశ్యామ్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు రావాల్సి ఉండగా బాలీవుడ్ లోనూ నటిస్తోంది.