కరోనా రెండో వేవ్ మరోసారి టెన్షన్ పెడుతోంది. రాబోయే రోజుల్లో మరో లాక్ డౌన్ ఉంటుందని మీడియాలు ఊదరగొట్టేస్తుండడంతో కొంత భయాందోళన నెలకొంది. మునుపటితో పోలిస్తే ప్రతిదీ అవగాహన ఉన్నా పరిస్థితి అదుపుతప్పితే ఎలా అన్నదే ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలు ముందస్తు చర్యలతో అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సరిగ్గా భారీ చిత్రాలతో థియేటర్లు కళకళలాడతాయని భావిస్తున్న తరుణంలో పెద్ద నిర్మాతలంతా టెన్షన్ పడుతున్నారట. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరికొన్ని భారీ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. చాలా మంది ఎంతో ఉత్సాహంగా వరుసగా సినిమాల్ని ప్రారంభించి చిత్రీకరణలు సాగిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పెద్ద చిత్రాలలో ఆచార్య ఒకటి. తాజా సన్నివేశానికి అనుగుణంగా కొరటాల శివ అలెర్టయ్యారట. ఎటువంటి రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడని అతడు చకచకా పనులు ముగించాలని చూస్తున్నారు. ప్రతిదీ వేగవంతం చేయమని తన బృందాన్ని కోరారని తెలిసింది. కారణం ఏదైనా కానీ ఆచార్య చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే కాజల్ తాజా షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రధాన తారాగణం పై సన్నివేశాల్ని పూర్తి చేస్తున్నారు. చెప్పిన టైమ్ కే ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.