ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకు పెరుగుతూ పోతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనా బాధితుల లిస్టులో చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ఉన్నారు. తాజాగా ఈ ప్రభావం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చెలరేగుతుంది. ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ అనేది ఇప్పుడు పవర్ స్టార్ వకీల్ సాబ్ చిత్రయూనిట్ వరకు చేరింది. తాజాగా వకీల్ సాబ్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్ కు పాజిటివ్ రావడంతో చిత్రయూనిట్ ఉలిక్కిపడింది. వకీల్ సాబ్ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన హీరోయిన్ నివేధా థామస్‌కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని నివేదానే స్వయంగా సోషల్ మీడియా ఖాతాలలో ప్రకటించింది.
నివేదా ట్విట్టర్ వేదికగా ఇలా పోస్ట్ చేసింది. ‘‘నాకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణలో తేలింది. అందుకే నేను స్వయంగా ఐసోలేషన్‌లో ఉంటూ.. త్వరగా కోలుకొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ.. ముఖ్యంగా నా మెడికల్ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ ధరించండి’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. నిన్నటివరకు ‘వకీల్‌సాబ్’ ప్రమోషన్స్ లో నివేదా ఉత్సాహంగా పాల్గొంది. ఇప్పుడు నివేదాకి కరోనా సోకడంతో చిత్రయూనిట్ కంగారు పడుతుంది. నిన్న మొన్నటివరకు నివేదాను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి చూడాలి ఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించాడు.