కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వాటిలో సినీ ఇండస్ట్రీ ఒకటి. గత రెండేళ్లలో భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతేడాది లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయి.. థియేటర్స్ మూతబడటంతో షూటింగులు పూర్తైన సినిమాలు విడుదల కాకపోవడంతో నిర్మాతలు బాగా నష్టపోయారు. దీనికి టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు.
2020 సమ్మర్ సీజన్ నుంచి వింటర్ వరకు మొత్తం సినిమా థియేటర్లు మూతపడటంతో తెలుగు సినీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. ఈ ఏడాది జనవరి నెలలో పరిస్థితులు మళ్ళీ సాదారణ స్థితికి రావడంతో టాలీవుడ్ లో ఎప్పటిలాగే సినీ కార్యక్రమాలు మొదలయ్యాయి. మూడు నెలల పాటు సినిమా షూటింగులు.. కొత్త సినిమాల విడుదలతో టాలీవుడ్ అంతా సందడిగా మారిపోయింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
టాలీవుడ్ లో కోట్ల బిజినెస్ జరిగే వేసవి సీజన్ వచ్చే సమయానికి ఈసారి కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభన మొదలైంది. దీంతో 2021లోనూ అవే పరిస్థితులు పునరావృతం అయ్యాయి. కరోనా ప్రభావంతో మరోసారి సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం.. థియేటర్లు మూత పడటం చూడాల్సి వచ్చింది. చాలా సినిమాలు విడుదల తేదీని ఖరారు చేసుకుని కూడా చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కోట్లలో బిజినెస్ చేస్తాయనుకున్న సినిమాలన్నీ ల్యాబ్ కే పరిమితం అయ్యాయి. దీంతో మళ్లీ కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ రెండేళ్లకు కలిసి ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే దాదాపుగా 750 కోట్లు నష్టపోయిందని తెలుస్తోంది. ఇందులో దాదాపు 500 కోట్లు 2020లో నష్టపోతే.. ఇప్పుడు ఈ రెండు నెలల్లో వాయిదాలు పడ్డ సినిమాలు కారణంగా సుమారు 250 కోట్లు నష్టపోయినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే గత కొన్ని రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇండస్ట్రీలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. లాక్ డౌన్ సడలించడంతో ఇప్పటికే కొన్ని సినిమాల చిత్రీకరణలు ప్రారంభమయ్యాయి. రేపు ఆదివారం నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోనుంది. థియేటర్స్ రీ ఓపెన్ అయితే ఎప్పటిలాగే సినిమాలు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే మళ్ళీ పుంజుకుంటుందని చెప్పవచ్చు.