నైజాం ఏరియా పై దాడి మొదలైందా!

Update: 2017-08-21 10:15 GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ లో నైజాం ఏరియాకి మకుటం లేని మహారాజుల్లా ఉన్న కొందరు అగ్ర నిర్మాతలకు - పంపిణీదారులకి చెక్ పెట్టేందుకు సన్నాహాలు మొదలైయ్యాయి. ఇందుకోసం కొందరు సినీ పెద్దలు సైలెంట్ ఓ పక్కా ప్లాన్ గీసినట్లు సమాచారం. మల్లూవుడ్ ని శాసిస్తున్న ఓ సినిమా కార్పొరేట్ గ్రూప్ గత కొన్నాళ్లుగా నైజాం ఏరియాల్లో ఉన్న బి - సి సెంటర్స్ ని లీజ్ తీసుకునే పనిలో ఉంది. హైదరాబాద్ తో పాటు వరంగల్ - నిజమాబాద్ - అదిలాబాద్ - కరీంనగర్ తదితరల ఏరియాల్లో ఉన్న సింగిల్ థియేటర్లను ఆ కార్పొరేట్ వారు మిగతా వారికంటే ఎక్కువ కోట్ చేసి లీజ్ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే జరిగితే దాదాపు 50 శాతానికి పైగా నైజాం ఏరియాలో ఉన్న థియేటర్లు ఆ కార్పొరేట్ చేతికి వెళ్లిపోతాయని సినీజనాలు అంటున్నారు. అలానే ఆ కార్పొరేట్ గ్రూప్ పెద్దది కావడంతో థియేటర్స్ ఆపరేషన్ మొత్తం కొచ్చి - ముంబై నుంచి సాగుతోందని, దీంతో ప్రస్తుతం నైజాం ఏరియాలో ఉన్న థియేటర్ మాఫియాకి తిప్పలు తప్పవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ లో మల్టీప్లెక్సుల విషయంలో కూడా ఇలానే జరిగిందని - భాగ్యనగరంలో ఉన్న మెయిన్ ఏరియాల్లో ప్రస్తుతం మల్టీప్లెక్సులదే హవా అని - ఇందులో స్క్రీన్లు కావాలంటే నిర్మాతలు మీడియేటర్లతో పనిలేకుండా డైరెక్టుగా మాట్లాడుకొని సినిమా ప్రద్శించుకొనే అవకాశం ఉంటుందని, కలెక్షన్ లెక్కలు తారు మారు అయ్సే పరిస్థితే ఉండదనేది ట్రేడ్ వర్గాల టాక్. మరి నైజాంలో సినీ దందాను ఆ కార్పొరేట్ వారు ఎంతమేరకు ఆపుతారో చూడాలి.
Tags:    

Similar News