అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న స్టార్ కమెడియన్

Update: 2021-10-01 10:30 GMT
ఎన్నో తమిళ సినిమాల్లో నటించి.. తెలుగు వారికి సుపరిచితమైన కమెడియన్ ‘వడివేలు’. తన నటనతో కామెడీ పూయించిన ఈ నటుడికి తాజాగా కోర్టు షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన్ను వెంటనే విచారణకు రావాలని ఆదేశించింది.

గత కొంత కాలంగా వడివేలుకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇతర కారణాల వల్ల కూడా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని వడివేలుకు ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది.

గతంలో వడివేలు ఇంట్లో ఐటీదాడులు నిర్వహించిన అధికారులు ఆయన తాంబారం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు.  అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలం విషయంలో తన సహ నటుడు సింగముత్తు తనను మోసం చేశాడని.. తన ప్రమేయం లేకుండానే ఆ స్థలాన్ని విక్రయించాడని వడివేలు ఆరోపించారు. సింగముత్తుపై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు ఎగ్మూర్ కోర్టులో నడుస్తోంది. గతంలోనే విచారణకు రావాలని కోర్టు వడివేలుకు సమన్లు పంపింది. అనుకోని కారణాలతో అప్పట్లో ఆయన విచారణకు హాజరు కాలేకపోయారు.గురువారం ఈ కేసు పిటీషన్ విచారణకు వచ్చింది.

ఈ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి వడివేలు విక్రయించారని కోర్టుకు తెలిపారు. పన్ను ఎగవేయడం కోసమే సింగముత్తుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ఈ క్రమంలోనే వాదనలు విన్న కోర్టు ఈసారి వడివేలు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
Tags:    

Similar News