ఆగష్టులోనే నడిగర్ సంఘం ఎన్నికలు!

Update: 2020-06-18 01:30 GMT
కోలీవుడ్ ఇండస్ట్రీలో గతేడాది జరిగిన నడిగర్ సంఘం ఎన్నికలు.. ఉద్రిక్తతతో కూడిన ప్రత్యక్ష్య ఎన్నికలను గుర్తు చేసాయి. గతేడాది ఎన్నికల ముందు హీరో విశాల్ మీద ప్రత్యర్ధి వర్గాల వారు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఒక రేంజ్ లో ఆందోళనలు సృష్టించారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి సీన్ రిపీట్ అవుతుందేమో అని టెన్షన్ మళ్లీ మొదలవుతుంది. పోయిన నిర్మాతల మండలి ఎన్నికలే జరగాల్సి టైంకి జరగకుండా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొందరు నిర్మాతలు మండలి కార్యాలయం మీద దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఈ ఎన్నికల వ్యవహారం కోర్టుకెక్కింది. ఇక న్యాయస్థానం తమిళ నిర్మాతల మండలికి ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేగాక జూన్‌ 30లోపు నిర్మాతల మండలి ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఆదేశించడం కూడా జరిగింది.

ఇక మొన్నటి మే నెలలో ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు చేసినా కరోనా పంజా విసరడంతో ఎన్నికలను వాయిదా వేయాలని కొందరు నిర్మాతలు న్యాయస్థానాన్ని చేరుకున్నారు. వెంటనే స్పందించిన కోర్టు కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని నడిగర్ సంఘం ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాలని మళ్లీ ఆదేశించింది. ఇక తాజా ఆదేశాల ప్రకారం నిర్మాతల మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈసారి కూడా ఎన్నికలలో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి నిర్మాత మురళి, టి.శివ పోటీ పడుతూ తమ టీమ్ లను కూడా ప్రకటించారు. ఇంకా వీళ్ళు మాత్రమే కాకుండా ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను.. టీజీ. త్యాగరాజన్.. ఇంకా నటుడు విశాల్‌ కూడా పోటీ చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం హీరో విశాల్ నడిగర్ సంఘం అధ్యక్ష్యుడిగా ఉన్నాడు. ఇంకా అసలు విషయాలు పై అధికారిక ప్రకటన రాలేదు.
Tags:    

Similar News