కరోనా విజృంభణతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా పేదల పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. ఆసుపత్రుల్లో బెడ్ దొరక్క.. ఆక్సీజన్ సిలిండర్లు లభించక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. పలువురు సెలబ్రిటీలు తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. వీరిలో ప్రముఖ నటి రేణూ దేశాయ్ కూడా ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా బాధితుల వివరాలు సేకరించి, తనకు వీలైన సహాయం చేస్తున్నారు.
అయితే.. ఇదే ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. సహాయం ఆశించే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని ఈ మధ్యనే చెప్పిన రేణూ.. ఓ వ్యక్తి చేసిన మెసేజ్ చూసి నొచ్చుకున్నారు. ‘‘మేడం గారూ.. సహాయం చేస్తామని అన్నారు కదా.. ఎక్కడ మేడం మీ సహాయం..? ఉన్నవాళ్లనే పట్టించుకుంటారా? మీరు’’ అని కామెంట్ చేశాడు. దీంతో.. సహనం కోల్పోయారు రేణు దేశాయ్. తానేమైనా రాజకీయ నేతనా? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు మీరు ఓట్లువేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులను అడగండి అని సమాధానం చెప్పారు.
అయినప్పటికీ.. తనవంతు సహాయం అందిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు మరో చిక్కు వచ్చిందట. చాలా మంది సహాయం కోరుతూ ఆమెను నేరుగా డబ్బులు అడుగుతున్నారట! తాను నేరుగా డబ్బులు ఇవ్వబోనని, సహాయం అవసరమైతే చెప్పండి.. దాన్నిపరిశీలించి సహకారం అందిస్తానని చెబుతున్నారు. అయినప్పటికీ వినకుండా కొందరు ఆమెను వేధిస్తున్నారట. డబ్బులు ఇవ్వకపోతే.. చనిపోతామని కూడా బెదిరిస్తున్నారట!
ఈ విషయాన్ని వెల్లడించి ఆవేదన వ్యక్తం చేశారు రేణూ.. డబ్బులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. రేణు ప్రకటనకు నెటిజన్లు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. నిజంగా అవసరం ఉన్నవారైతే సహకారం తీసుకోవాలిగానీ.. డబ్బులు అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే.. సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అని నిలదీస్తున్నారు.