సినిమా ఇండస్ట్రీలో వారసుల హడావిడీ ఎక్కువే అన్నది తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మరీ ఎక్కువగా వుందన్నది జగమెరిగిన సత్యం. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, ఉప్పలపాటి ఫ్యామిలీల నుంచి తొలి తరం హీరోలు వేసిన బాటని అనుసరిస్తూ మలి తరం హీరోలు ఎంట్రీ ఇవ్వడం.. హీరోలుగా స్టార్ డమ్ పని సొంతం చేసుకోవడం తెలిసిందే. అందులో చాలా మంది బ్రదర్స్ చాలా వరకు కెరీర్ పరంగా నిలబడలేకపోయారు. కొంత మంది ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు.
ఎన్టీఆర్ తరువాత బాలయ్య ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు.., చిరు ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు డజన్ మంది. వెంకీ , నాగ్ ఫ్యామిలీల నుంచి హీలు భారీ స్థాయిలో తెరపైకొచ్చారు. అందులో కొంత మంది స్టార్ లుగా నిలబడితే ఇప్పటికీ కొంత మంది ట్రై చేస్తూనే వున్నారు. ఇలా ఈ మధ్య అన్నని చూసి ఎంట్రీ ఇచ్చిన తమ్ముళ్లు కూడా హీరోలుగా నిలబడేందుకు తెగ కష్టపడుతున్నారు. అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ తరువాత అల్లు శిరీష్ హీరోగా నిలబడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ వర్కవుట్ కావడం లేదు. రీసెంట్ గా 'ఊర్వశివో రాక్షసివో'తో కమర్షియల్ హిట్ ని దక్కించుకున్నాడని హడావిడి చేశారు..దీంతో తమ్ముడికి హిట్టొచ్చిందని బన్నీ కూడా హ్యాపీగా ఫీలయ్యాడు.. కట్ చేస్తే.. ఆ తరువాత అంత లేదని తేలడంతో గీతా క్యాంపస్ అంతా సైలెంట్ అయిపోయారు. అల్లు అర్జున్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నా అతని తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఆ స్థాయి కాదు కదా ఇంత వరకు సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకోలేకపోయాడు.
'గౌరవం'తో ఎంట్రీ ఇచ్చిన శిరీష్ హీరోగా బన్నీ తరహాలో అల్లు వారి గౌరవాన్ని కాపాడతాడని భావిస్తున్నారు.. కానీ అది జరగడం లేదు. ఇక ఇదే తరహాలో సాయిధరమ్ తేజ్ సోదరులు పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఇదే తరహాలో స్ట్రగుల్ అవుతున్నాడు. తొలి మూవీ 'ఉప్పెన'తో బ్లాక్ బస్టర్ ని దక్కించుకున్నా ఆ తరువాత ఆ స్థాయిలో కాకుండా కనీసం సక్సెస్ ని కూడా దక్కించుకోలేకపోతున్నాడు. వైష్ణవ్ తేజ్ నటించిన 'కొండ పొలం', రంగ రంగ వైభవంగ' ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయాయి.
శ్రీకాంత్ ఎన్. రెడ్డితో చేస్తున్న సినిమాతో అయినా వైష్ణవ్ తేజ్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే. వీరి తరహాలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. 'దొరసాని' సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్'తో ఫరవాలేదనిపించాడు. 'పుష్పక విమానం', 'హైవే'లతో మరీ లోకి వెళ్లిపోయాడు. ఇప్పడు సాయి రాజేష్ నీలం చేస్తున్న 'బేబీ', ఉదయ్ శెట్టి 'గం గం గణేశా' సినిమాపైనే ఆనంద్ దేవరకొండ కెరీర్ ఆధారపడి వుంది.
ఇంత వరకు స్టార్ హీరోల తమ్ముళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారున్నారు. తరువాతి తరం సక్సెస్ కారనే ఫార్ములాని బ్రేక్ చేశారు. మరి ఈ తమ్ముళ్లు కూడా వారి లాగే ఫార్ములాని బ్రేక్ చేస్తారా? .. కమర్షియల్ హిట్ లని దక్కించుకుని అన్నకు తగ్గ తమ్ముళ్లు అనిపించుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.