డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీని కోసం తీవ్రంగా శ్రామిస్తున్నాడు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇటీవల 'తీస్ మార్ ఖాన్' అనే యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చిన ఆది సాయి కుమార్.. ఇప్పుడు ''క్రేజీ ఫెలో'' అనే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో దిగంగన సూర్యవన్షీ - మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటించారు.
పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న 'క్రేజీ ఫెలో' చిత్రాన్ని 2022 అక్టోబర్ 14న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మూవీ ప్రమోషన్స్ భాగంగా ఈరోజు గురువారం ఉదయం సినిమా టీజర్ ను విడుదల చేశారు.
"సినిమా స్టైల్ లో ఒక్క పంచ్ లైన్ లో మనోడి గురించి చెప్పాలంటే.. మందు తాగితే లివర్ పోతుంది.. సిగరెట్ తాగితే లంగ్స్ పోతాయి.. వీడితో ఉంటే దూల తీరిపోతుంది" అని హీరో పాత్ర స్వభావాన్ని పరిచయం చేయడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది.
లైఫ్ లో ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా.. ఏమాత్రం బాధ్యత లేకుండా ఆవారా గా తిరిగే యువకుడిగా ఆది కనిపించాడు. దీనికి తగ్గట్టుగానే 'పులితో పరుగు పందెం.. నాతో మందు పందెం వేయకూడదు' అని డైలాగ్స్ చెప్తున్నాడు. తానే ఏ అమ్మాయిని లవ్ చేయలేదని బీరాలు పలుకుతున్నాడు.
వెదవలకు ఇంట్రడక్షన్ అవసరం లేదంటూ హీరోపై తనకున్న అభిప్రాయాన్ని హీరోయిన్ వెల్లడిస్తోంది. టీజర్ లో ఆది పాత్ర చాలా క్రేజీగా కనిపించింది. అయితే అతను పైకి పోరంబోకులా ఉన్నా లోపల మాత్రం చాలా మ్యాటర్ ఉందని చెబుతున్నారు. రౌడీలతో ఫైట్ చేయడం.. పోలీసులతో తన్నులు తినడం లాంటివి కూడా ఇందులో చూడొచ్చు.
టీజర్ లో కథేంటినేది హింట్ ఇవ్వలేదు కానీ 'క్రేజీ ఫెలో' అనేది ఒక ఫన్ ఫైల్ల్డ్ ఎంటర్టైనర్ అని హామీ ఇస్తోంది. దీంట్లో ఆది చాలా ఈజ్ తో హుషారుగా కనిపించాడు. సప్తగిరి - నర్రా శ్రీనివాస్ - అనీష్ - వినోదిని వైద్యనాథన్ - రవి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం సమకూర్చగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నిస్తున్న ఆది కి ఈ 'క్రేజీ ఫెలో' ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.