మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇప్పటివరకూ ఈ సినిమా బిజినెస్ స్టార్ట్ కాలేదు కానీ షూటింగ్ చివరి దశలో ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందు కోవడంతో ట్రేడ్ వర్గాలలో కదలిక వచ్చిందని సమాచారం. నైజాం ఏరియాకు గానూ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి రూ. 25 కోట్లు ఆఫర్ చేశారట.
నైజాం ఏరియాలో ఉన్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లలో సుధాకర్ రెడ్డి ఒకరు అయినప్పటికీ ఈమధ్య సినిమా నిర్మాణంపై ఫోకస్ చేయడంతో డిస్ట్రిబ్యూషన్ కు దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా సుధాకర్ రెడ్డి అయన పార్టనర్స్ తో కలిసి లారెన్స్ సినిమా 'కాంచన 3' ను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇకపై డిస్ట్రిబ్యూటర్ గా జోరుపెంచాలని.. పెద్ద సినిమాలను పంపిణీ చేయాలని చూస్తున్నారట. ఆ ప్లాన్ లో భాగంగానే రామ్ చరణ్ కు 'సైరా' నైజాం ఏరియాకు గానూ భారీ ఆఫర్ ఇచ్చారట.
మరి 'సైరా' నిర్మాత రామ్ చరణ్ ఈ ఆఫర్ ను ఒకే చేస్తాడా లేదా ఇంకా పెద్ద ఫిగర్ ఎమైనా కోట్ చేస్తాడా అనేది వేచి చూడాలి. 'బాహుబలి' ఫ్రాంచైజీ సినిమాలు పక్కన పెట్టి చూస్తే మాత్రం ఈ ఆఫర్ 'సైరా' కు క్రేజీ ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ చూస్తేనే 'సైరా' పై ట్రేడ్ వర్గాలలో ఎలాంటి క్రేజ్ ఉందనేది మనకు అర్థం అవుతుంది.