ప్ర‌భాస్ ని ఫిక్స్ చేసుకున్న క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌!

Update: 2023-01-16 15:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ 'రాధేశ్యామ్‌' త‌రువాత మునుపెన్న‌డూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ మూవీస్ ని లైన్ లో పెట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నాడు. ఆ నాలుగు క్రేజీ సినిమాల్లో మూడు పాన్ వ‌రల్డ్ రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయ‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మూడింటికి మూడు సినిమాలు కూడా ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

ప్ర‌భాస్ న‌టిస్తున్న మూడు క్రేజీ సినిమాలు 'ఆది పురుష్‌', స‌లార్‌, ప్రాజెక్ట్ కె'. ఇందులో 'ఆది పురుష్ 3డీ, ఐమాక్స్‌ ఫార్మాట్ ల‌లో రిలీజ్ కు రెడీ అవుతుండ‌గా 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా 'స‌లార్‌' కూడా త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతోంది. భారీ కాస్టింగ్ తో క‌నీ వినీ ఎరుగ‌ని స్టోరీతో ఈ మూవీని తెర‌కెక్కిస్తుండ‌టం.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ టెర్రిఫిక్ గా వుండ‌టంతో ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

'స‌లార్‌' ని ఇప్ప‌టికే 2023 సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ కాకూడ‌ద‌ని ద‌ర్శ‌కుడు మిగ‌తా ప‌నుల్ని, బ్యాలెన్స్ షూటింగ్ ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడ‌ట‌. ఇక 'ప్రాజెక్ట్ కె' మాత్రం 2024 సంక్రాంతికే వ‌స్తుంద‌ని తెలుస్తోంది. 'ఆది పురుష్‌'ఈ ఏడాది జూన్ లో రాబోతోంది. వీటిని ప‌క్క‌న పెడితే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం మ‌రో సినిమాని మారుతితో చేస్తున్నాడు.

హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రూపొందుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే ఈ సినిమాల‌తో పాటు ప్ర‌భాస్ మైత్రీ మూవీ మేక‌ర్స్ కు ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేయ‌బోతున్నాడ‌ని, దీనికి బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ సిద్దార్ద్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ తో సినిమా వుంటుంద‌ని తేల్చి చెప్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

ద‌ర్శ‌కుడు సిద్ధార్ధ్ ఆనంద్ ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ న‌టించిన 'ప‌ఠాన్‌' మూవీకి ద‌ర్శకత్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. దీపికా ప‌దుకునే హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ జ‌న‌వ‌రి 25న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఇదిలా వుంటే ఈ సంక్రాంతికి మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీర‌య్య‌', నంద‌మూరి బాల‌కృష్ణ‌తో 'వీర సింమారెడ్డి' సినిమాల‌ని నిర్మించి స‌క్సెస్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News