పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ `హరి హర వీర మల్లు`. డైరెక్టర్ క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తరువాత మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం. ఏ. దయాకర్ రావు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ 17వ శతాబ్దంలోని మొగల్ సామ్రాజ్య కాలం నేపథ్యంలో సాగనుంది.
కోహినూర్ వజ్రం రాబరీ నేపథ్యంలో ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ పిరియాడిక్ ఫిక్షనల్ డ్రామా అన్ని అనుకున్న విధంగా జరిగి కోవిడ్ ఇబ్బందులు సృష్టించకుంటే ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసేది. ఇప్పటికే చిత్రీకరణ కీలక ఘట్టాలతో సగ భాగం పూర్తయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఆరు నెలలకు గానీ ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కనిపించడం లేదు.
ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో క్రిష్ ఆ సమయాన్ని `కొండ పొలం` చిత్రానికి కేటాయించారు. ఆ మూవీ పూర్తి కావడం, రిలీజ్ కావడం కూడా జరిగిపోయింది. అయితే `హరి హర వీరమల్లు` గురించి మాత్రం ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ కారణంగా మళ్లీ ఈ మూవీ వార్తల్లో నిలుస్తోంది. నిధి అగర్వాల్ `హీరో` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ జనవరి 15న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తున్న నిధి అగర్వాల్ `హరి హర వీరమల్లు` చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. ఈ మూవీ పిరియాడిక్ ఫిల్మ్ గా కనిపిస్తున్నా మరో డైమెన్షన్ కూడా వుందని తెలిపింది నిధి. ఈ చిత్ర కథ రెండు వేరు వేరు కాలాల్లో నడుస్తుందని స్పష్టం చేసి షాకిచ్చింది. `మగధీర` తరహాలో వుండబోతోందని తెలుస్తోంది.
దశాబ్దాల కిందటి కాలం నేపథ్యంలో కథ నడుస్తుందని, అదే సినిమాకు హైలైట్ అని పేర్కొంది. అంటే సినిమా వేరు వేరు కాలాల్లో కథ నడిస్తే పవన్ కల్యాణ్ మోడ్రన్ కాలంతో పాటు ప్రజెంట్ కాలంలోనే కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో పవన్ పిరియాడిక్ లుక్ ని చూపించారు. అంటే మోడ్రన్ లుక్ కి సంబంధించిన లుక్ తాచారన్నమాట. త్వరలోనే పవన్ మోడ్రన్ లుక్ ని బయటికి రిలీజ్ చేస్తారా లేక సినిమా రిలీజ్ వరకు సస్పెన్స్ గానే దాచేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.