రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి ఇంటిపై క్రైంబ్రాంచ్ ఫోకస్.. ఆ సీక్రెట్స్ కోసం సోదాలు

Update: 2021-07-24 02:30 GMT
అశ్లీల వీడియోలు రూపొందించి యాప్ లో పెట్టి అమ్మారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక కేసును మరింత సీరియస్ గా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తీసుకున్నారు. అధికారులు ఏమాత్రం పట్టువిడవడం లేదు. తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ బృందం మరోసారి శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు సమాచారం.  కొద్దిసేపటి క్రితం ముంబై క్రైం బ్రాంచ్ బృందం ముంబైలోని జుహూ ప్రాంతంలోని శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా నివాసానికి చేరుకున్నారు. వారి ఇంట్లో మళ్లీ కొత్తగా మొదటి నుంచి సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

రాజ్ కుంద్రా ఇంట్లో అలాగే అతడి సన్నిహితుల ఇంట్లో కూడా మరికొన్ని రోజుల వరకూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.రాజ్ కుంద్రా బిజినెస్ అసోసియేట్ ర్యాన్ తోర్పేను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్ ముగియడంతో ప్రవేశపెట్టారు.

కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసులు తమ కస్టడీని పొడిగించాలని కోరగా అందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజ్ కుంద్రా అతడి టీం సభ్యులు అశ్లీల వీడియోలు రూపొందించి యాప్స్ లో అప్ లోడ్ చేసి బిజినెస్ చేసుకుంటున్నారని.. అది చట్టవిరుద్ధం అని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇక రాజ్ కుంద్రా ఫోన్లో వివరాలు ఉన్నాయని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలుతుందని అన్నారు. ఈ క్రమంలోనే అతి వ్యాపార వ్యవహారాలను, లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Tags:    

Similar News