ఈ మధ్యన ఫేస్ బుక్ పేరుతో ఒక సినిమా వచ్చింది. ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెనక్కి తిరిగి వెళ్లిపోయిందో కూడా సరిగా గుర్తు లేని విధంగా ఆ సినిమాలో నటించిన హీరోపై తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో ఇంటి కిరాయి అగ్రిమెంట్ చేసుకోవటమే కాదు.. ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్న తీరుతో నటుడు ఉదయ్ కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రిమినల్ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్ పేటకు చెందిన శివప్రసాద్ కలాని అనే వ్యాపారి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 59లో నందగిరి హిల్స్ ఆదిత్యహిల్స్ లో ఫ్లాట్ ఉంది. ఈ నెల 23న ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకునేందుకు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
అగ్రిమెంట్ అనంతరం ఉదయ్ కిరణ్ కు సంబంధించిన వివరాల్ని ఇంటర్నెట్ లో వెతగ్గా.. డ్రగ్స్.. కారు చోరీ కేసుల్లో పీడీ యాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో.. అతనికి ఇంటిని అద్దెకు ఇవ్వలేనని యజమాని చెప్పారు. దీనికి ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. లగేజీతో పాటు ఫ్లాట్ వద్దకు వచ్చిన తర్వాత ఇంటిని అద్దెకు ఇవ్వనని ఎలా చెబుతారంటూ వాచ్ మెన్ వద్ద తాళం తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకున్న వాచ్ మన్ ను బెదిరించటంతో పాటు..కొంతమందిని తీసుకొచ్చి ఫ్లాట్ యజమానిపై బెదిరింపులకు దిగినట్లుగా ఆరోపిస్తున్నారు. దీంతో.. ఉదయ్ కిరణ్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఫిర్యాదు చేయటంతో.. ప్రాధమిక ఆధారాలు పరిశీలించిన పోలీసులు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.