ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో చిక్కుల్లో పడ్డాడు. ఒకప్పటి టీచర్ అయిన అమెరికా మహిళ కేథరిన్ మయోర్గో అతడిపై రేప్ ఆరోపణలు చేసింది. ఐతే ఈ రేప్ జరిగింది ఈ మధ్య కాదు. పదేళ్ల కిందట అట. 2009లో లాస్‌వెగాస్‌లోని ఓ హోటల్ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని మయోర్గా కోర్టులో కేసు వేసింది. తాను ఓ పని మీద రొనాల్డో గదికి వెళ్లానని.. ఐతే మనం ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని.. దుస్తులు మార్చుకోమని అతను చెప్పాడని.. మార్చుకోవడానికి బాత్ రూంకు వెళ్తే అక్కడికొచ్చి తనను బలవంతంగా బెడ్ రూంకి తీసుకెళ్లి.. వద్దు వద్దంటున్నా వినకుండా రేప్ చేశాడని ఆమె ఆరోపించింది. అప్పుడే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. కానీ తర్వాత ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయానని ఆమె చెప్పింది.
అత్యాచారం విషయం బయటికి పొక్కకుండా దాచి ఉంచేందుకు అప్పట్లో రొనాల్డో మనుషులు తనకు 3 లక్షల 75 వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారని.. ఐతే తాను మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని.. అందుకే దాన్ని రద్దు చేయాలని తాను వేసిన దావాలో మయోర్గో పేర్కొంది. ఈ కేసును లాస్ వెగాస్ పోలీసులు కూడా రీఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. రొనాల్డో లాయర్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. ఐతే ఇన్నేళ్ల పాటు సైలెంటుగా ఉండి.. రేప్ జరిగిన పదేళ్లకు కేసు వేయడం పట్ల మయోర్గోను సామాజిక మాధ్యమాల్లో రొనాల్డో ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఐతే మయోర్గో ఆ రేప్ తర్వాత మానసికంగా కుంగిపోయిందని.. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా చేసిందని.. ఇప్పుడు కూడా ఆమె మానసిక స్థితి బాగా లేదని.. కొంత కాలంగా జరుగుతున్న ‘మి టు’ క్యాంపైన్ చూశాక స్ఫూర్తి పొంది రొనాల్డోపై కేసు వేసిందని మయోర్గో లాయర్ వివరించాడు.