కరోనా మహమ్మారి చిన్నా పెద్దా అని తేడా ఏమీ చూపించట్లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది సెలబ్రెటీలు దీని బారిన పడ్డారు. ఇండియాలో సినిమా వాళ్లను సైతం వైరస్ పలకరించింది. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కరోనా కారణంగా చనిపోవడం తెలిసిన సంగతే. అతడి తల్లి సైతం కరోనా బారిన పడింది. ఇప్పుడు ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ కుటుంబాన్ని కరోనా వైరస్ తాకింది.
హైదరాబాద్‌లో మురళీ మోహన్ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు భార్యా భర్తలట. మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోందట. ఈ ముగ్గురిలో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో ముందు ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలడంతో మిగతా ఇద్దరినీ పరీక్షలకు పంపారు. వారు కూడా పాజిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలో మురళీ మోహన్ కొడుకు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
ఇంటి పనులకు సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు పనివారి మీదనే ఆధారపడటం కామన్. ప్రస్తుత సమయంలో వారిని ఇంటి దగ్గరే నివాసం కల్పించి పనిలో పెట్టుకోవడం అయినా చేయాలి. లేదంటే... సొంతంగా అయినా పనులు చేసుకోవాలి. బయట నుంచి ప్రతిరోజు వచ్చి వెళ్లే పరిస్థితులు ఉంటే ఈ రిస్కు కచ్చితంగా ఉన్నట్లే. వారికి జాగ్రత్తలు నేర్పడం కూడా అవసరం.