దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో కంటెంట్ కంటే కూడా కాంట్రవర్శీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. కంటెంట్ లేకున్నా పర్వాలేదు కాని కాంట్రవర్సీ మాత్రం ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ఈయన డీ కంపెనీ సినిమా ను అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఆయన కాదన్నా మరెవ్వరు కాదన్నా ఇది అండర్ వరల్డ్ డాన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కథ తో తెరకెక్కించిన విషయం అందరికి తెలుసు. ఈనెల 26న హిందీ మరియు తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేశాడు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా లోని సత్యమేవ జయతే పాట విడుదల అయిన సమయంకు డీ కంపెనీ ట్రైలర్ ను విడుదల చేశాడు.
డీ కంపెనీ టీజర్ ను తెలుగు మరియు హిందీల్లో ఒకే సారి విడుదల చేసిన వర్మ ట్రైలర్ ను మాత్రం కేవలం హిందీలోనే విడుదల చేశాడు. త్వరలో తెలుగులో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. వర్మ డీ కంపెనీ ట్రైలర్ లో ఆయన ఏం చూపించాలనుకుంటున్నాడు కాన్సెప్ట్ ఏంటీ అనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. కాని వర్మ ఈమద్య కాలంలో చేసిన సినిమాల్లో మాదిరిగానే నాసిరకమైన కంటెంట్ నే ఈ సినిమా లో చూడబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. వర్మ గతంలో అండర్ వరల్డ్ సినిమా లంటే అదిరి పోయేలా చేసేవాడు. కాని ఇప్పుడు ఆ మార్క్ ఈ సినిమా లో కనిపించడం లేదు. ఆయన శ్రద్ద పెట్టి తీయలేదా లేదంటే ఆయనలో స్టప్ తగ్గిందో అర్థం కావడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ తోనే సినిమా పై ఇంప్రెషన్ తగ్గిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Full View