ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్ రంగంలో దశాబ్ధాల పాటు వేళ్లూనుకున్న అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం ప్రకంపనాలు రేపుతోంది. కరోనా మహమ్మారీ రాకతో అంతా మారిపోయింది. జనాల సినిమా వీక్షణ.. వ్యూవర్ షిప్ విధానంలో పెనుమార్పులు చోటు చేసుకంటున్నాయి. థియేటర్ల భవిష్యత్ పై ఇది కొంతవరకూ ప్రభావం చూపడం ఖాయమని ఆయన అన్నారు.
ఇతకుముందులా జనం థియేటర్లలో సినిమా వీక్షణ కోసం వేచి చూసే పరిస్థితి లేదు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ బోలెడంత వినోదం దొరుకుతోంది. నచ్చినదానిని టైమ్ లెస్ గా నచ్చినప్పుడే చూసుకునే విధానానికి అలవాటు పడుతున్నారు. ఎక్కడికో వెళ్లి సినిమా చూడాలన్న ఆలోచన మారుతోంది. డిజిటల్ వల్ల ఓటీటీల వల్ల ఇది సాధ్యమవుతోంది. దీనివల్ల కచ్ఛితంగా థియేటర్లకు వచ్చే ఆడియెన్ తగ్గుతారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక నగరాల్లో ఆడియెన్ సినిమా వీక్షణ వేరుగా ఉందని మల్టీప్లెక్సులకు వచ్చి సినిమాలు చూసేవాళ్లు పెరుగుతున్నారని తనదైన శైలిలో విశ్లేషించారు. డి.సురేష్ బాబుకి హైదరాబాద్ సహా పలు నగరాల్లో మల్లీప్లెక్స్ స్క్రీన్లు ఉన్న సంగతి తెలిసిందే.
దిల్ రాజు వంటి ప్రముఖ ఎగ్జిబిటర్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు తన చేతిలోకి తీసుకుంటున్నారు కదా..! అంటే.. ఆయన తన సినిమాలను రిలీజ్ చేసుకునేందుకు సౌకర్యంగా అలా చేస్తున్నారు! అని కూడా అన్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితి మరింత మారిందని ఓటీటీ వీక్షణ పెరుగుతోందని సురేష్ బాబు అన్నారు. మరి మీరే సొంతంగా ఓటీటీ ఎందుకు ప్రారంభించకూడదు? అని ప్రశ్నిస్తే.. అమెజాన్ ప్రైమ్- నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలు బిలియన్ డాలర్ పెట్టుబడులు పెడుతున్నాయని అవన్నీ లాస్ లోనే నడుస్తున్నాయని వివరణ ఇచ్చారు. తనకు ఇప్పట్లో ఓటీటీ ప్రారంభించే యోచన లేదని అతడి మాటల్ని బట్టి అర్థమైంది.