డాంగ్ డాంగ్: మహేష్-మిల్కీ అదరగొడుతున్నారుగా

Update: 2019-12-29 04:23 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే టీజర్.. నాలుగు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ తాజాగా మరో పాట ప్రోమోను విశాఖ ఉత్సవ్ సందర్భంగా విడుదల చేశారు.

డాంగ్ డాంగ్ అంటూ సాగే పాట ప్రోమో వీడియో దాదాపుగా ఒకటిన్నర నిముషం ఉంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.  డాంగ్ డాంగ్ పాటకు సాహిత్యం అందించిన వారు రామజోగయ్య శాస్త్రి. పాడినవారు నకాష్ అజీజ్..  లవిట లోబో.  "హలో.. ఆజ్ రాత్ మీరే ఘర్ మే పార్టీ హై తూ ఆజానా..  డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్" అంటూ హిందీ పదాలతో ఈ పాట సాహిత్యం మొదలైంది. ఫిమేల్ వెర్షన్ హిందీలో సాగితే.. మేల్ వెర్షన్ గానం 'జోరుగుంటదా.. జోషుగుంటదా' అంటూ హీరోయిన్ ను అడుగుతున్నట్టుగా సాగింది.  పార్టీ సాంగ్ కావడం తో ట్యూన్లో ఊపుంది. మిలిటరీ క్యాంప్ లో సాగే పాట కాబట్టి మహేష్.. తమన్నా ఇతర డ్యాన్సర్లు అందరూ మిలిటరీ డ్రెస్సుల్లో ఉన్నారు. మహేష్ కూడా ఫుల్ జోష్ లో స్టెప్స్ వేశారు.  ఇక తమన్నా అయితే రెచ్చిపోయింది.  ఇద్దరి స్టెప్పుల ఫ్యాన్స్ కు మంచి ఊపు తెప్పించడం ఖాయమే. ఇక డింగ్ డాంగ్ ఫుల్ సాంగ్.. లిరికల్ వీడియోను డిసెంబర్ 30 వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తామని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ కార్యక్రమాలు పూర్తిచేసి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా రష్మిక మందన్న నటించింది.  ఈ సినిమాలో విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. రాజేంద్రప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.  జనవరి 11 న 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ అవుతోంది.


Full View

Tags:    

Similar News