నాన్న వేరు ఆయన లెవల్ వేరు

Update: 2022-08-27 00:30 GMT
విక్రమ్‌ హీరోగా నటించిన కోబ్రా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం తాజాగా జరిగింది. ఆ సందర్భంగా విక్రమ్‌ తనయుడు ధృవ్‌ మాట్లాడుతూ తన తండ్రి యొక్క గొప్పతనం ను చెప్పుకొచ్చాడు. కోబ్రా సినిమా కోసం నాన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మూడు సంవత్సరాల క్రితం సినిమా ను ప్రారంభించిన సమయంలో ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటని నేను నాన్న ను అడిగాను.

అప్పుడు నాన్న మాట్లాడుతూ.. దర్శకుడు అజయ్ యొక్క గొప్ప సృజనాత్మకత ఈ సినిమా లో చూపించబోతున్నాడు. ఆయన ప్రతి సినిమా కూడా విభిన్నంగా ఉంటుంది కనుక ఈ సినిమా కూడా అంతకు మించి విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దర్శకుడు అజయ్ తాను అనుకున్నది అనుకున్నట్లుగా అద్భుతంగా కోబ్రా సినిమా గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు అన్నాడు.

ఒక వేళ నేను నటుడిని కాకున్నా కూడా ఈ సినిమా యొక్క ఈవెంట్‌ కు వచ్చేవాడిని. ఎందుకంటే ఈ సినిమా నాన్నకు చాలా స్పెషల్‌ సినిమా. ప్రతి సినిమా మాదిరిగా కాకుండా ఈ సినిమా కోసం ఆయన చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లుగా ధృవ్‌ చెప్పుకొచ్చాడు. సినిమాలోని ప్రతి సన్నివేశం కోసం ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కనుక ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదిగా నాన్న అంటారు.

ఇక నాన్న నేను కలిసి మహాన్ సినిమా లో నటించాం. ఆ సమయంలో ఒక సన్నివేశం కోసం చాలా కష్టపడ్డాం. ఇద్దరం కూడా ఆ యాక్షన్ సన్నివేశం కోసం చాలా సమయం వర్కౌట్స్ చేయాల్సి వచ్చింది. ఆ సన్నివేశం అయిన తర్వాత నేను పూర్తిగా అలసి పోయి విశ్రాంతి తీసుకున్నాను. కానీ నాన్న మాత్రం తర్వాత పని మొదలు పెట్టి బిజీ అయ్యాడు.. అప్పుడే అనిపించింది నాన్న వేరు ఆయన లెవల్‌ వేరు అని.

ఒక సన్నివేశం కోసం అంతగా కష్టపడి కూడా వెంటనే మరో పనిలో ఎలా మీరు బిజీ అవ్వగలరు.. మీరు ఎందుకు అలసి పోవడం లేదు అంటూ నాన్నను మహాన్ సినిమా షూటింగ్‌ సమయంలో అడిగాను. అప్పుడు ఆయన.. నేను ఈ స్థాయికి రావడం కు చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ముందు ఈ కష్టం పెద్దది కాదు అన్నట్టుగా అన్నారు. ఆయన ఎంతగా కష్టపడుతారో ఆ సంఘటనతో నాకు అర్థం అయ్యిందని ధృవ్‌ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News