అన్నపూర్ణ+దగ్గుబాటి=కొత్త దారి

Update: 2018-01-15 08:30 GMT
టాలీవుడ్ లో గొప్ప చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థల్లో అన్నపూర్ణ స్టూడియోస్ - సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్థానం చాలా ప్రత్యేకమైనది. తెలుగు సినిమా గమనాన్ని మార్చిన ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ఘనత - చరిత్ర ఈ రెండు బ్యానర్లకు ఉంది. వాటి అధినేతలు కాలం చేసినా ఆ విలువలు మాత్రం ప్రేక్షకుల మనస్సులో ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఒకప్పుడు ప్రొడక్షన్ తమ నిత్య కృత్యంగా పెట్టుకున్న ఈ రెండు సంస్థలు మారుతున్న కాలానుగుణంగా సినిమాల నిర్మాణాన్ని బాగా తగ్గించుకున్నాయి. రామా నాయుడు గారు అన్ని బాషలలో కలిపి వందకు పైగా సినిమాలు తీసిన నిర్మాతగా గినిస్స్ బుక్ లో స్థానం సంపాదించుకున్నా చివరి దశలో ఓ పదేళ్ళు ప్రొడక్షన్ కు దాదాపు దూరంగానే కాలం గడిపారు.వారి అబ్బాయి సురేష్ బాబు నాన్న సినిమాలు తీసినన్ని రోజులు ఆయనకు కుడి భుజంలా మోసారు. ప్రస్తుతం సబ్జెక్టు మరీ బాగుంటే తప్ప స్వంతంగా సినిమాలు తీయటం బాగా తగ్గించారు.

ఇక అన్నపూర్ణ స్టూడియోస్ కూడా సినిమా నిర్మాణం కొనసాగిస్తున్నప్పటికీ ముందున్నంత స్పీడ్ ఇప్పుడు లేదు. నిన్న విడుదలైన రంగుల రాట్నం మూవీ ఇదే బ్యానర్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. కథ బాగా నచ్చి దర్శకుడు మీద నమ్మకం ఉంటే తప్ప నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ తారల వారసులు ఈ లెగసీని కంటిన్యూ చేసే బాధ్యతను తీసుకున్నారు. వాళ్ళే రానా, సుప్రియ.

రానా - సుప్రియలు కలిసి సురేష్ సంస్థను అన్నపూర్ణ బ్యానర్ పార్టనర్ షిప్ లో వెబ్ కంటెంట్ - టీవీ కమర్షియల్స్ - షార్ట్ ఫిలిమ్స్ తదితరాలు నిర్మించేందుకు రంగంలోకి దిగారు. మెంటల్ మదిలో ఫేం నివేత పేతురాజ్ తో ఒక బ్రాండ్ యాడ్ షూట్ కూడా అయిపోయింది. కొత్త జానర్ లోకి అడుగు పెడుతూ రెండు బ్యానర్ల పేరును నిలబెడుతూనే కలిసి టీవీ షోల వైపు అడుగులు వేసేలా ప్రణాళిక వేసుకుంటున్నారు.రానా సినిమాల్లో, టీవీలో బిజీగా ఉండగా సుప్రియ చాలా కాలం నుంచే అన్నపూర్ణ నిర్మాణ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో హీరొయిన్ ఆవిడే.
Tags:    

Similar News