డ్రగ్స్ ఉచ్చులో పడి యువతరం జీవితాలు నాశనమవుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అనంతరం డ్రగ్స్ కేసులపై విచారణ సంచలనమే అయ్యింది. అయినా ఇంకా డ్రగ్స్ పుచ్చుకుంటూ సెలబ్రిటీ కిడ్స్ నార్కోటిక్స్ వాళ్లకు దొరుకుతూనే ఉన్నారు. ఈ కేటగిరీలోనే మరో సెలబ్రిటీ కుమారుడు అరెస్టయ్యారు.
ప్రముఖ వెటరన్ నటుడు దలీప్ తాహిల్ కుమారుడు ధ్రువ్ ను ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్ సెల్ పదేపదే డ్రగ్స్ కొనుగోలు చేసినందుకు అరెస్టు చేసింది. ధ్రువ్ - డ్రగ్ పెడ్లర్ మధ్య బ్యాంక్ లావాదేవీలు వాట్సాప్ చాట్ల ఆధారంగా ఈ అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ ను పెడ్లర్ ముజామిల్ అబ్దుల్ షేక్ నుంచి ధ్రువ్ కొనుగోలు చేశాడని ఆరోపించారు. షేక్ వాట్సాప్ చాట్స్ లో 2019- 2021 మధ్యకాలంలో ధ్రువ్ చాలాసార్లు డ్రగ్స్ సేకరించాడని వెల్లడించారు. మాదకద్రవ్యాల ఔషధాల కొనుగోలు కోసం ధ్రువ్ డ్రగ్ పెడ్లర్స్ ఖాతాల్లోకి ఆరుసార్లు చెల్లింపులు చేసినట్లు కూడా కనుగొన్నారు.
ఏప్రిల్ 20 న 35 గ్రాముల మెఫెడ్రోన్ (ఎండి) తో అధికారులు షేక్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. అతని ఫోన్ ను అధికారులు దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్నారు. షేక్ తో ధ్రువ్ చాట్ చేసి గత రెండేళ్లలో అతను అనేక కొనుగోళ్లు చేసినట్లు తెలిసింది. ధ్రువ్ పేరు బయటపడిన తరువాత పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. ఇప్పుడు మే 6న కోర్టులో హాజరుపరుస్తారు.