తెలుగు సినిమాల్లో డ్యాన్స్ కు ఉండే ప్రాధాన్యం ఎక్కువే. హీరోల డ్యాన్సులు చూసేందుకే వచ్చే అభిమానులూ ఉంటారు. అందుకే సీనియర్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు తమ సినిమాల్లో అభిమానులను అలరించే కొత్త రకం స్టెప్పులపై ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. ఇన్ని ఉన్నా కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకోవడానికి కోలీవుడ్ కన్నా టాలీవుడ్డే బెటర్ అంటున్నారు డ్యాన్స్ మాస్టర్ షోబి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలందరి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నఆయన పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే.
‘‘తెలుగు ఇండస్ట్ర్రీ తనకు చిన్నప్పటి నుంచే పరిచయం - కమర్షియల్ ఎంటర్ టెయినర్లలో వందలాది మంది గ్రూపు డ్యాన్సర్లు వెనుక ఉండగా హీరో హీరోయిన్లతో స్పెప్పులు వేయించడం నా వరకు చాలా ఈజీ. అదే హీరో.. హీరోయిన్లు మాత్రమే ఉండే రొమాంటిక్ సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేయడం కాస్త సవాలే. కానీ అదే బాగుంటుంది. తమిళ ప్రేక్షకులు సాధారణంగా హీరో పక్కింటబ్బాయిలా కనిపించాలనుకుంటారు. అక్కడ డ్యాన్స్ మాస్టర్ కు పెద్దగా స్వేచ్ఛ ఉండదు. తెలుగులో స్టార్ హీరోల పాటంటే దుమ్ము దులిపే స్టెప్పులుంటాయి. ఆ రకంగా తెలుగు సినిమాల్లోనే డ్యాన్స్ మాస్టర్ కు స్వేచ్ఛ ఎక్కువే.’’ అనేది షోబి మాస్టర్ అభిప్రాయం.
షోబి మాస్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ సినిమా.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న రంగస్థలంతోపాటు నాగచైతన్య - మహేశ్ బాబు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. హీరోగా తనకు అవకాశాలు వచ్చినా కాదనుకున్నానని... త్వరలో రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కే ఓ సినిమాను డైరెక్టర్ చేయబోతున్నానని షోబి మాస్టర్ చెప్పుకొచ్చారు.