అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' కొత్త రికార్డులను కొల్లగొడుతూ ముందుకు వెళుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఈ సినిమా విడుదలకు ముందే జనంలోకి దూసుకుపోయాయి .. ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ఇక ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. 'ఊ అంటావా మావా .. ఊ ఊ అంటావా మావా' అనే పాట ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. చంద్రబోస్ రాసిన సాహిత్యంతో పాటు, డాన్స్ మాస్టర్ విజయ్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి.
తాజా ఇంటర్వ్యూలో డాన్స్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ .. "బన్నీగారు నన్ను పిలిచి అవకాశం ఇస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ 'పుష్ప' సినిమా విషయంలో నా కల నిజమైంది. అప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాను నేను థియేటర్లో చూశాను. ఆ పాట వస్తున్నప్పుడు కుర్రాళ్లంతా షర్టులు విప్పేసి డాన్సులు చేస్తున్నారు. ఆ రెస్పాన్స్ చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ఈ సినిమాకి పనిచేసే ఛాన్స్ నాకు అనుకోకుండా వచ్చింది.
ఇంతకుముందు నేను చేసిన డాన్సులు ఒక వీడియో చేసి కొంతమంది కో డైరెక్టర్స్ కి పంపించాను. అలా బన్నీ సార్ నా వీడియోను చూసి నన్ను పిలిపించమన్నారట. కాల్ రాగానే నేను వెళ్లి బన్నీగారిని కలిశాను. ఆయన 'ఊ కొడతావా' అనే పాట గురించి నాకు చెబుతూ ఉంటే, అసలు ఇది కలా? నిజమా? అన్నట్టుగా, ఆయన మాటలు కొన్ని నాకు వినిపించనేలేదు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ను అర్థం చేసుకుని సాంగ్ ను కంపోజ్ చేసి . బన్నీగారికి చూపించాను. ఆ తరువాత రెండు రోజుల పాటు ఎలాంటి కాల్ రాకపోవడంతో టెన్షన్ పడిపోయాను.
ఆ తరువాత రోజున కాల్ వచ్చింది .. దాంతో సెట్ కి వెళ్లి బన్నీగారిని కలిశాను. మా టీమ్ తో కలిసి బన్నీ గారి కోసం వెయిట్ చేస్తుండగా ఆయన అక్కడికి వచ్చారు. నన్ను చూస్తూనే షేక్ హ్యాండ్ ఇచ్చి 'చింపేశావ్ .. చాలా బాగా చేశావ్ .. నీ టేకింగ్ బాగుంది .. ఇలాగే కంటిన్యూ చెయ్' అంటూ భుజం తట్టారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఫస్టు నుంచి హెల్ప్ చేస్తూ వచ్చిన శేఖర్ మాస్టర్ తో ఆ ఆనందాన్ని పంచుకున్నాను.
ఈ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. సమంత ప్రతి విషయాన్ని చాలా వివరంగా అడిగేవారు. ఎలా చేయవచ్చు .. ఏం చేయవచ్చు అని అడిగేవారు. సమంత .. బన్నీ ఇద్దరూ కూడా చూడగానే చేసేసేవారు. సుకుమార్ గారు కొన్ని స్టెప్స్ ను ప్రత్యేకించి మెచ్చుకున్నారు. షూటింగు లాస్ట్ రోజున బన్నీ గారు పిలిచి 'నీకు మంచి పేరు వస్తుంది' అని చెప్పారు. ఈ పాట కోసం నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా నాకు చాలా సంతృప్తిని కలిగించింది" అని చెప్పుకొచ్చాడు.