లైలా వివాదం.. హాస్పిటల్ బెడ్ మీద పృధ్వీ.. ఏమైంది?
ఆయన చేసిన కామెంట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి.
ఇటీవల జరిగిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ రాజకీయ వివాదాంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న ప్రముఖ హాస్యనటుడు పృధ్వీ తన ప్రసంగంలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేగింది. ఆయన చేసిన కామెంట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో సోషల్ మీడియాలో #BoycottLaila అనే ట్రెండ్ జోరుగా నడుస్తోంది.
ఈ వివాదానికి కారణం పృధ్వీ చేసిన కొన్ని వ్యాఖ్యలే. గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచిందని ఆయన తన మాటల్లో 11 మేకలు అంటూ సెటైరికల్ గా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీ అభిమానులను కోపానికి గురి చేశాయి. సినిమా ప్రమోషన్ వేదికగా రాజకీయ విమర్శలు చేయడం తగదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీంతో కొందరు నెటిజన్లు మాత్రమే కాకుండా వైసీపీ కార్యకర్తలు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, నటుడు పృధ్వీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక తాజా పరిణామంగా, ఈ వివాదం పెరిగిపోయి సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపడంతో పృధ్వీ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. అసలు కారణం ఏమిటో గాని అనుకోకుండా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హై బీపీ కారణంగా చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది .
పృధ్వీ ఆసుపత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు #BoycottLaila ట్రెండ్ కొనసాగుతుండగా, మరోవైపు పృధ్వీ ఆరోగ్య పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
మరోవైపు లైలా మూవీ యూనిట్ కూడా ఈ వివాదంపై స్పందించింది. తమ సినిమాకి రాజకీయ సంబంధాలు లేవని, ఈ విషయంలో తనిఖీ చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. హీరో విశ్వక్ సేన్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, "ఇది మా సినిమాలోని ఎవరికీ సంబంధం లేని అంశం. దయచేసి సినిమా జోలికి రావొద్దు" అని అభ్యర్థించారు.
ఇక ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సినిమా ప్రమోషన్‌లో అనుకోకుండా జరిగిన ఈ ఘటన లైలా చిత్రానికి ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది కాస్త వేచిచూడాల్సిన అంశం. మరి పృధ్వీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఈ వివాదంపై స్వయంగా ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.