స్టార్ నే మించిపోయిన అంకుల్

Update: 2018-06-20 08:03 GMT
మనం సరదాకో లేక ప్యాషన్ తోనో  మనం అభిమానించే హీరోలను ఇమిటేట్ చేయటం ఒకోసారి ఊహించని పాపులారిటీ తెస్తుంది. ప్రొఫెసర్ శ్రీవాత్సవ దీన్ని ఇప్పుడు స్వయంగా ఆస్వాదిస్తున్నారు. గోవిందా వీరాభిమాని అయిన ఈయన చాలా కాలంగా తాను అభిమానించే హీరో పాటలకు డాన్స్ చేయటం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ మధ్య సరదాగా ఒక వీడియో సోషల్ మీడియాలో పెడితే అది కాస్త వైరల్ అయిపోయి ఏకంగా గోవిందాకు చేరిపోయింది.

శ్రీవాత్సవ  వయసు 60కి దగ్గరలో ఉండటమే ఇంత సెన్సేషన్ కి కారణం. తన వయసుని లెక్క చేయకుండా పొట్టను మేనేజ్ చేసుకుంటూ చాలా ఈజ్ తో వేస్తున్న స్టెప్స్ కి యూత్ కూడా ఔరా అనుకున్నారు. బాడీలో  ఇంత గ్రేస్ ఎలా చూపిస్తున్నాడా అని డాన్స్ మాస్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. దెబ్బకు ఈ టీచర్ ఆల్ ఇండియా ఫేమస్ కావడానికి ఎక్కువ టైం పట్టలేదు. సెలబ్రిటీగా మారిపోయి ఏకంగా ఒక డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసాడు.

కథ అక్కడితో అయిపోలేదు. తాను ఎవరినైతే స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ దాకా వచ్చాడో ఆ హీరో పక్కన నిలుచుని అతనితో పాటే స్టెప్స్ వేయటం ఇప్పుడు తాజా సంచలనం. కలర్స్ టీవి నిర్వహిస్తున్న డాన్స్ దివానే షోలో పాల్గొన్న శ్రీవాత్సవ తన ఫేవరెట్ హీరో గోవిందాతో కలిసి కాలు కదిపిన వీడియో టీజర్ ని ఆ ఛానల్ విడుదల చేసింది. అందులో శ్రీవాత్సవ కంటే మిన్నగా డాన్స్ చేయడానికి గోవిందానే ఇబ్బంది పడటం చూసి వారేవా అంకుల్ అంటున్నారు అందరు.

ఆప్కే ఆ జానే సే అనే సూపర్ హిట్ సాంగ్ సాంగ్ కు  ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే ఆడియన్స్ తో సహా జడ్జ్ లు గా ఉన్న మాధురి దీక్షిత్ బృందానికి నోట మాట రాలేదు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదే వయసు డాన్స్ కు అనర్హం అనేలా శ్రీవాత్సవ అంకుల్ స్ఫూర్తితో చాలా మంది మధ్య వయస్కులు వృద్ధులు డాన్స్ స్కూల్స్ లో ఎంక్వయిరీలు చేస్తున్నారట. అంకుల్ ఎఫెక్ట్ మామూలుగా లేదే అని మెచ్చుకుంటున్నారు నెటిజెన్లు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News