దంగల్ @ 1800 కోట్లు

Update: 2017-05-25 14:20 GMT
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్.. చైనాలో కొత్త చరిత్ర సృష్టించేసింది. మొదటగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు చైనాలో రికార్డుల దుమ్ము దులిపేసింది. మే 5న చైనాలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ అక్కడ రూ.1100 కోట్ల వసూళ్లను సాధించేసి కొత్త చరిత్ర సృష్టించింది.

చైనాలో వెయ్యి కోట్ల వసూళ్లను ఇప్పటివరకూ ఏ హాలీవుడ్ చిత్రం కూడా సాధించలేకపోయింది. ఆ ఫీట్ ను సాధించిన తొలి విదేశీ చిత్రంగా ఆమిర్ మూవీ దంగల్ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎమోషన్స్ బేస్డ్ గా సాగే ఈ మూవీకి చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఇంకా చైనాలో ఈ మూవీ జోరు తగ్గకపోవడం అసలు సిసలైన విశేషం. ఈ మొత్తంతో కలిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దంగల్ గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 1800 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దంగల్ సృష్టించిన అరుదైన రికార్డుతో.. బాహుబలి2 వెనకబడిపోయింది.

ఇప్పటివరకూ బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 1575 కోట్లు. దీంతో మొత్తం వసూళ్లలో బాహుబలి2 రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. చైనా లాంటి ప్రధాన మార్కెట్లలో బాహుబలి2 ఇంకా రిలీజ్ కాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ దంగల్ మాదిరిగా ఫీలింగ్స్ బేస్డ్ మూవీ కాకపోవడం.. చైనాలో బాహుబలి లాంటి గ్రాఫిక్ బేస్డ్ మూవీస్ చాలానే రూపొందుతూ ఉండడం వంటి అంశాలను పరిశీలిస్తే.. చైనాలో దంగల్ ను బీట్ చేయడం బాహుబలికి కష్టం కావచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News