సౌత్ లో 'డార్లింగ్స్' రీమేక్.. అదీ షారుక్ ఖాన్ లెక్క‌!

Update: 2022-08-14 14:30 GMT
బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన 'డార్లింగ్స్'  ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. 16  దేశాల్లో ట్రెండింగ్ లో నిలిచిన చిత్ర‌మిది. భార్యాభార్త‌ల బాండింగ్ గురించి ద‌ర్శ‌కురాలు జ‌స్మీత్ . కె. రీన్ చెప్పిన విధానం విదేశీయుల‌కు ఎంత‌గానో? క‌నెక్ట్ అయింది. హిందీ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకుంది.

అయితే ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు..త‌మిళ భాష‌ల ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి షారుక్ ఖాన్  చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ రెడీ అవుతోంది. ఈ రెండు భాషల్లో 'డార్లింగ్స్' ని రీమేక్ రూపంలో  ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ సీఈవో గౌర‌వ్ వ‌ర్మ రివీల్ చేసారు. సినిమాకి మంచి విజ‌యం వ‌చ్చింది.

''హిందీ భాష‌కే ఈ విజ‌యాన్ని ప‌రిమితం చేయాల‌నుకోవ‌డం లేదు. ఇత‌ర భాష‌ల్లోనూ డార్లింగ్స్ రీమేక్ చేయాల‌నుకుంటున్నాం. ముందుగా తెలుగు..త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తామ‌ని'' తెలిపారు.  ఈ రెండు భాష‌ల్లో తెర‌కెక్కించి మిగ‌తా భాష‌ల్లోకి అనువ‌దించే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ సినిమా నిర్మాణంలో అలియా కూడా భాగ‌మ‌య్యే అవ‌కాశం ఉందా? అంటే అవున‌నే గుస‌గు స‌వినిపిస్తుంది.

మాతృక‌లో రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో పారితోషికంనే అమ్మ‌డు పెట్టుబ‌డిగా పెట్టి న‌టించింది. సినిమాని నెట్ ప్లిక్స్ విక్ర‌యించి మంచి లాభాలు ఆర్జించింది. రీమేక్ హ‌క్కుల్లో అలియాకి కూడా భాగం ఉంది. ఈ నేప‌థ్యంలో తెలుగు.త‌మిళ్ భాష‌ల్లో ఆమె కూడా భాగ‌స్వామి అయ్యే అవ‌కాశం ఉంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అలియా  టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.  డేట్లు స‌ర్దుబాటు స‌హా గ‌ర్భం దాల్చిన నేప‌థ్యంలో  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ సినిమా అవ‌కాశం వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ నేప‌థ్యంలో అలియా సైతం ఇక్క‌డి సినిమాల్లో న‌టించాల‌ని ఆస‌క్తిగానే ఉంది. ఈ కార‌ణాలు కూడా అలియాని రీమేక్ నిర్మాణంలో భాగం చేయ‌డానికి దోహంద చేస్తాయ‌ని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాతో రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తెలుగు..త‌మిళ్ లోకి అడుగు పెడుతుంది.

ఇప్పుడిప్పుడే షారుక్ సైతం సౌత్ మార్కెట్ వైపు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ యంగ్ మేక‌ర్ అట్లీతో 'జ‌వాన్' సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా న‌య‌న‌తార స‌హా త‌మిళ్ న‌టుల్ని భాగం చేస్తున్నాడు. ఆ ర‌కంగా షారుక్ సౌత్ స్ర్టాట‌జీ బ‌య‌ట ప‌డింది. తాజాగా  రెడ్ చిల్లీస్ 'డార్లింగ్స్' ని స్థానిక భాష‌ల్లో రీమేక్  చేయ‌డం వెనుక ఇదే స్ర్టాట‌జీ కనిపిస్తుంది.
Tags:    

Similar News