తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే దాసరిది ప్రత్యేక స్థానం. ఇండియాలో మరే దర్శకుడికీ సాధ్యం కాని రీతిలో 151 సినిమాలు తీశారు దాసరి. అందులో ఎన్నెన్ని మెగా హిట్లో. దర్శకుడిగానే కాక నటుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. బహుముఖ ప్రజ్నను చాటుకున్న ప్రతిభాశాలి దాసరి. ఐతే సినీ రంగంలో తిరుగులేని స్థాయిని అందుకున్న దాసరికి.. పరిశ్రమలో తొలి రోజు మాత్రం చేదు అనుభవం ఎదురైందట. ఆయన్ని ఉద్దేశించి ఓ మేకప్ మన్ దారుణమైన వ్యాఖ్యలు చేశాడట. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో దాసరి ఆ అనుభవం గురించి వివరించారు. రచయిత కావడానికంటే ముందు తాను నాటకాల్లో నటుడిగా మంచి పేరుతో పాటు అవార్డులు కూడా సంపాదించానని.. తన గురించి తెలుసుకున్న ఓ నిర్మాత సినిమాల్లో అవకాశం ఇస్తానని అడిగాడని.. తనకు ఆసక్తి లేదని చెప్పినప్పటికీ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి.. ఓ సినిమాలో ప్రధాన హాస్య నటుడి పాత్ర కోసం గట్టిగా అడిగేసరికి ఒప్పుకున్నానని దాసరి చెప్పారు.
ఐతే ఆ వేషం కోసం షూటింగుకి వెళ్తే తనకు అవమానం జరిగిందని దాసరి వెల్లడించారు. తనకు మేకప్ వేసిన కృష్ణ అనే వ్యక్తి.. ‘‘ప్రతివాడూ ఒక నాటకం వేసేయడం.. ఒక కప్పు తెచ్చుకోవడం.. వెంటనే మద్రాసు సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో దిగిపోవడం.. వేషం వేసేయాలనుకోవడం.. అసలెప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావా నువ్వు’’ అంటూ ఈసడించుకున్నట్లుగా దాసరి తెలిపారు. నిర్మాత పిలిచాడని వెళ్తే మేకప్ మన్ తనకు ఇంతగా అవమానించినట్లు చెప్పారు. ఇది చాలదన్నట్లు తనకు ముందు చెప్పినట్లు ప్రధాన హాస్య నటుడి వేషం ఇవ్వలేదని.. అది బాలకృష్ణ అనే కమెడియన్ తో చేయించి.. తనకు అతడి అసిస్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారని.. అదేంటని నిర్మాతను అడిగితే.. ఇదంతంగా తనకు తెలియకుండా జరిగిందని చెప్పారని దాసరి వివరించారు. అయినా అవమానాన్ని దిగమింగుకుని తానేమీ మాట్లాడలేదని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/