ప్రభాస్‌ 20 ఫస్ట్‌ లుక్‌కు డేట్‌ ఫిక్స్‌

Update: 2020-06-09 03:30 GMT
ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ లో రూపొందుతున్న మూవీ అప్‌ డేట్‌ కోసం ఫ్యాన్స్‌ గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసం ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్‌ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆ మద్య నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ పై సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ప్రచారం కూడా చేసిన విషయం తెల్సిందే. ఫ్యాన్స్‌ ఒత్తిడితో ఎట్టకేలకు ప్రభాస్‌ 20 మూవీ ఫస్ట్‌ లుక్‌ ను రెడీ చేశారు.

చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్‌ లుక్‌ ను ఈనెల 14వ తారీకున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ తో పాటు టైటిల్‌ ను కూడా రివీల్‌ చేయబోతున్నారు. మొదట జాను అంటూ ప్రచారం జరిగినా ఆ తర్వాత ఆ టైటిల్‌ కాదనుకున్నారు. ప్రస్తుతం రెండు మూడు టైటిల్స్‌ ప్రచారం అవుతున్నాయి. ఆ టైటిల్స్‌ లో ఒకదాన్ని ఫైనల్‌ చేశారా లేదంటే మరేదైనా కొత్త టైటిల్‌ అనుకున్నారా అనేది తెలియాలంటే ఫస్ట్‌ లుక్‌ వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

సాహో చిత్రం విడుదలకు ముందే ప్రారంభం అయిన ఈ సినిమా పీరియాడిక్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కుతోంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రభాస్‌ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఎక్కువగా యూరప్‌ దేశాల్లో ఈ సినిమాను చిత్రీకరణ జరుపుతున్నారు. సినిమాలో ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికి ఉంది. సాహో సినిమా ఉత్తరాదిన భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమాను కూడా హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా మహమ్మారి వైరస్‌ కారణంగా వచ్చే ఏడాది వరకు సినిమా కోసం వెయిట్‌ చేయాల్సి వస్తుంది. షూటింగ్స్‌ కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే విదేశాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా హైదరాబాద్‌ లోనే సెట్టింగ్స్‌ వేసి మిగిలిన షూట్‌ ను పూర్తి చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News