నిర్మాతల మండలి ఎన్నికలు చాలా కాలంగా వాయిదాల ఫర్వంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం సరికాదని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని.. డిజిటల్ ప్రొవైడర్స్ VPF చార్జెస్ తగ్గించాలని కొందరు నిర్మాతలు చేసిన ధీక్ష 17 వ రోజుకు నిరాటంకంగా చేరింది. 04 జనవరితో ఎట్టకేలకు ధీక్ష ముగిసింది. నిర్మాతల మండలి EC మీటింగ్ లో కార్యవర్గం ఫిబ్రవరి 26 వ తేదీ ఎలక్షన్స్ జరపాలని నిర్ణయించడంతో దీక్ష విరమించామని నిర్మాతలు తెలిపారు.
17రోజుల నుంచి దీక్షలో పాల్గొంటున్న జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీ ఎలక్షన్స్ పెట్టాలని నిర్మాతల కౌన్సిల్ కార్యవర్గం నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని.. డిజిటల్ ప్రొవైడర్స్ ప్రతినిధులకు వినతి పత్రం ఇచ్చి మాట్లాడగా వారంతా సానుకూలంగా స్పందించారని అందుకే దీక్ష విరమించామని తెలిపారు.
మరింతగా వివరాల్లోకి వెళితే.. పదవీకాలం ముగిసినప్పటికీ నిర్మాతల మండలి ఎన్నికలు ఆలస్యం కావడంపై కొందరు నిర్మాతలు నిరసనలు వ్యక్తం చేసారు. ఎలక్షన్ ఆలస్యానికి వ్యతిరేకంగా కొందరు నిర్మాతలు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. ఎట్టకేలకు కౌన్సిల్ సమావేశం జరపగా ఎన్నికల నిర్వహణలో జాప్యంపై కొందరు నిర్మాతలు మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ ను నిలదీశారు. చివరకు ఫిబ్రవరి 26న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
ధీక్ష ఫలవంతం అయిన అనంతరం నిర్మాతలు దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దీక్షలో ఎక్కువ రోజులు పాల్గొన్న మిత్తాన ఈశ్వర్ రావు- వరప్రసాద్- తోట కృష్ణ- వీరారెడ్డి- డి.వి.గోపాల్ రావు లకు 17 రోజులు దీక్షను సందర్శించి పూర్తి మద్దతు తెలిపిన యలమంచి రవిచంద్- రవీంద్ర గోపాల్ లకు నిర్మాతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాతల మండలి వర్సెస్ నిర్మాతల గిల్డ్!నిజానికి పరిశ్రమ సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించడం లేదని నిర్మాతల మండలిపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. నిర్మాతల మండలికి సమాంతరంగా మరో బలమైన శాసించే వ్యవస్థ రూపుదిద్దుకుంది. అదే 'యాక్టివ్ నిర్మాతల గిల్డ్'. నిరంతరం ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు తీసే పలువురు అగ్ర నిర్మాతలు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసి శాసించడం ప్రారంభించారు. దీంతో నిర్మాతల మండలి తన ఉనికిని కోల్పోయిందని కూడా విమర్శలొచ్చాయి.
ఇటీవల టాలీవుడ్ లో సమస్యలను పరిష్కరించేందుకు నెల రోజుల పాటు షూటింగులు ఇతర కార్యకలాపాల ఆపేయాలని నిర్మాతల గిల్డ్ నిర్ణయించి విజయం సాధించింది. ఫలు దఫాలు 24శాఖల ప్రముఖులతో చర్చలు సాగించి కొత్త ప్రతిపాదనలను తెరపైకి తేవడంలో విజయం సాధించారు. దీంతో సి కళ్యాణ్ సారథ్యంలో ని నిర్మాతల మండల నామమాత్రమేనని నిరూపణ అయ్యింది. ఇలాంటి తరుణంలో మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలలో గెలిచే కొత్త అధ్యక్షుడు యాక్టివ్ నిర్మాతల గిల్డ్ తో పోటీపడి మండలి ఉనికిని కాపాడాల్సి ఉంటుంది. ఈ వార్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.