మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వ్యవహారం అంతకంతకు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా ఈసారి ఏకంగా ఆరుగురు సభ్యులు సంఘం అధ్యక్షుడి పదవికి పోటీపడుతున్నారు. ప్రకాష్ రాజ్- మంచు విష్ణు- జీవిత- హేమ- సీవీఎల్ నరసింహారావు- కాదంబరి కిరణ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ని ప్రకటించారు.
ప్రకాష్ రాజ్ కి ధీటుగా పోటీపడి నెగ్గాలన్న పంతంతో మంచు విష్ణు వర్గం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా సంఘం ఇప్పటికే రెండు సార్లు వర్చువల్ మీటింగులు ఏర్పాటు చేసి కీలక సభ్యులతో అన్ని విషయాలను ముచ్చటించారు. అయితే ఇన్నాళ్లు మా ఎన్నికల తేదీని మాత్రం ప్రకటించలేదు.
సంఘంలో మెజారిటీ సభ్యులు సెప్టెంబర్ 10న ఎన్నికలు నిర్వహించాలని కోరుకున్నారు. కానీ దానిని క్రమశిక్షణా సంఘం ఆమోదించలేదు. ఎట్టకేలకు అందరూ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న మా ఎలక్షన్ తేదీ ని క్రమశిక్షణా సంఘం ప్రకటించింది. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు అక్టోబర్ 10న రిలీజ్ కానున్నాయి. అంటే సభ్యులు సూచించిన తేదీకి నెలరోజులు ఆవల ఈ డేట్ ని ఫిక్స్ చేయడం ఆసక్తికరం. సభ్యుల ప్రచారానికి ఇంకా 45 రోజుల సమయం ఉంది.