భారతీయ చిత్రాలన్నా.. అందులోని డైలాగులు, సీన్లు అన్నా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చెవి కోసుకుంటాడు. అందుకే ప్రతి హిట్ సినిమాలోని సీన్లను ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటాడు. కరోనా కాలంలో డేవిడ్ భాయ్ తెలుగు సహా పలు ఇండియన్ సినిమాల్లోని పాటలు, డైలాగులను స్ఫూఫ్ చేసి ఆ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
వార్నర్ ఈ విధంగా చేసిన ప్రతి వీడియో లక్షల్లో వ్యూస్ అందుకునేవి. బుట్టబొమ్మ సాంగ్ నుంచి మొదలుకొని ఇటీవల వచ్చిన పుష్ప వరకూ చాలా చిత్రాల్లోని సన్నివేశాలకు ప్యారడీ చేశాడు. గత ఏడాది విడుదలైన పుష్ప చిత్రం నుంచైతే వేరే చెప్పనక్కర్లేదు.
వీలైనన్నీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మధ్యకాలంలో వీడియోలకు కాస్త గ్యాప్ ఇచ్చిన వార్నర్.. తాజాగా మరో సరికొత్త వీడియోతో ముందుకొచ్చాడు.
ఇటీవలే విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రంలోని డైలాగ్ కు స్ఫూఫ్ చేశాడు. ట్రైలర్ లో వచ్చిన వయలెన్స్ డైలాగును ప్యారడీ చేశాడు. ‘వయలెన్స్’ అంటూ కేజీఎఫ్2లోని యశ్ సినిమా డైలాగ్ ను డేవిడ్ భాయ్ ఇన్ స్టాగ్రామ్ పేరడీ వీడియో తీసి అదరగొట్టాడు.
ఆ డైలాగ్ మధ్యలో బ్యాక్ డ్రాప్ లో తను బ్యాటింగ్ చేస్తున్న వీడియోలను జత చేశాడు. దీంతో ఆ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మ ీడియాలో వైరల్ అవుతోంది.
గత ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ ను వదులుకోవడంతో ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. దాదాపు రూ.6.25 కోట్లకు వార్నర్ ను చేజిక్కించుకుంది. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోని వార్నర్.. తర్వాతి మ్యాచుల్లో అదరగొట్టాడు. తన రెండు మ్యాచ్ ల్లో కలిపి 65 పరుగులు చేశాడు వార్నర్.