మొన్నటి లాక్ డౌన్ వేళ తెలుగు పాటలతో టిక్ టాక్ వీడియోల్లో ఆడిపాడి దంచికొట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అందరినీ అలరించాడు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం కావడంతో వార్నర్ ఇలా తన భార్య, పిల్లలతో కలిసి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కూడా కావడంతో తెలుగు పాటలపై ఎక్కువగా టిక్ టాక్ వీడియోలు చేశాడు. ఆయా దర్శకులు, హీరోల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
తాజాగా ఇండియా టుడేతో మాట్లాడిన డేవిడ్ వార్నర్ తాను ఎందుకు టిక్ టాక్ వీడియోలు చేయాల్సి వచ్చిందో కారణం చెప్పాడు. కరోనా లాక్ డౌన్ తో కష్టాల్లో ఉన్న ప్రజల ముఖాలపై చిరునవ్వులు తేవడానికే తాను ఈ టిక్ టాక్ వీడియోలు చేశానని వార్నర్ తెలిపాడు. తనకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తెలియదని.. అభిమానుల కోరిక మేరకు ఆ పాటలు చేశానని వివరించాడు. తొలుత ‘బుట్టబొమ్మ’ సాంగ్ చేయడంతో దానికి బాగా స్పందన రాగా మిగతా పాటలను చేశానని తెలిపాడు. అభిమానులు అడిగిన పాటలకే తాను చేశానన్నారు.
భారతీయ పాటలకు స్టెప్పులు వేయడం చాలా కష్టమని.. వాటిని చేయాలంటే శ్రద్ధ అవసరమని.. చాలా సమయం తీసుకొని చేశానని డేవిడ్ వార్నర్ వివరించాడు.