కొరటాల శివ - మహేష్ బాబు కాంబినేషన్‌తో వచ్చిన శ్రీ మంతుడు ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో వచ్చే భరత్ అను నేను సినిమాపై కుప్పలుగా ఆశలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. ఆ సినిమా కోసం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో... వారికి ఓ గుడ్ న్యూస్. అదేంటంటే...
భరత్ అను నేను షూటింగ్ త్వరత్వరగా జరుగుతోంది. అన్ని పార్ట్ లను తెరకెక్కించి ఎలాగైనా మార్చి2 కల్లా షూటింగ్ ముగించేయాలని భావిస్తోంది. అలాగే డబ్బింగ్ తదితరాలు కూడా మార్చి 8 కల్లా పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. చివరగా ఓ పాటని హీరో హీరోయిన్ల మధ్య చిత్రించాల్సి ఉంది. అది కూడా హైదరాబాద్ లోనేనట. ప్రస్తుతం సినిమా షూటింగ్ నగరంలోనే జరుగుతోంది. భారీ స్థాయిలో ప్లాన్ చేసిన క్లైమాక్స్ దృశ్యాలను కొరటాల తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చుపెట్టినట్టు కూడా సమాచారం. రామ్ - లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
మహేశ్ ఈ సినిమాలో తొలిసారి ముఖ్యమంత్రిగా - రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. సందేశంతో కూడిన చిత్రంగా తెలుస్తోంది. ఎలాగైనా ఏప్రిల్ 27 న సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది చిత్రయూనిట్. కాని అదే రోజున ఇప్పుడు కాలా సినిమా డేట్ ఇచ్చారు కాబట్టి.. వీళ్లు ఏం చేస్తారో చూడాలి.